
నేటి కాలంలో చదువు లేదా ఉద్యోగ రీత్యా పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరాల్లో లేదా విదేశాల్లో నివసించడం సర్వసాధారణం. అయితే, వారి మధ్య ఉన్న దూరాన్ని సాంకేతికత ఎలా తగ్గిస్తుందో ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది. అమ్మనాన్నల ప్రేమకు సరిహద్దులు లేవు! తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ నిష్కల్మషంగా ఉంటుంది. పిల్లలు ఎంత ఎదిగినా, ఎంత దూరంలో ఉన్నా వారి ఆలోచనలు ఎప్పుడూ పిల్లల చుట్టూనే తిరుగుతుంటాయి. దీనికి అద్దం పట్టే ఒక భావోద్వేగ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరినీ కదిలిస్తోంది. ఒక యువతి తన తల్లిదండ్రుల భద్రత కోసం వారి ఇంట్లో సిసిటివి (CCTV) కెమెరాను ఏర్పాటు చేసింది.
ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఒకరికొకరు పలకరించుకుంటూ ఉండే ఈ రోజుల్లో ఒక కుటుంబం తమ ప్రేమను పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది. దూరంగా ఉంటున్న కుమార్తెపై తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమానురాగాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివానీ శుక్లా అనే యువతి, తన తల్లిదండ్రులు ప్రతిరోజూ సీసీటీవీ కెమెరా ముందు తనను కలుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.
శివానీ శుక్లా అనే యువతి తన తల్లిదండ్రులు ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి, భద్రత కోసం ఇంట్లో ఒక సిసిటివి కెమెరాను అమర్చింది. సాధారణంగా సిసిటివి అంటే దొంగతనాలు లేదా నిఘా కోసం వాడతాము. కానీ, ఇక్కడ అది ఒక ప్రేమ సంభాషణకు వేదికైంది. ఆ తల్లిదండ్రులకు తమ కుమార్తె తన మొబైల్ ద్వారా ఈ కెమెరా దృశ్యాలను చూస్తుందని తెలుసు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, వృద్ధ దంపతులు పనులు చేసుకుంటూ మధ్యమధ్యలో కెమెరా దగ్గరకు వస్తారు. కెమెరా వైపు చూస్తూ చేతులు ఊపుతూ తల్లీ! బాగున్నావా?, టైమ్‌కు తింటున్నావా? అంటూ ప్రేమగా అడుగుతారు. ఆ సమయంలో వారి ముఖాల్లో కనిపించే ఆనందం, కుమార్తెను నేరుగా చూస్తున్నామనే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఒక చక్కటి సూచన లాంటిది.. వారిని తరచుగా పలకరించండి అని ఒక నెటిజన్లు చాలా మంది కామెంట్ చేశారు. సాంకేతికత మనల్ని ఇంత దగ్గర చేస్తుందని ఊహించలేదు, ఇది చాలా అందమైన దృశ్యం అని మరొకరు రాశారు.
వీడియో ఇక్కడ చూడండి..
నేటి బిజీ లైఫ్‌లో మనం ఎంత బిజీగా ఉన్నా, మన కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కోసం కొద్ది నిమిషాలు కేటాయించడం ఎంత అవసరమో ఈ వీడియో గుర్తు చేస్తోంది. దూరం అనేది కేవలం కిలోమీటర్లలోనే ఉంటుందని, మనసుల మధ్య కాదని వైరల్‌గా మారిన ఈ వీడియో తెలియజేస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..