Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

|

Jan 24, 2022 | 2:31 PM

చాంద్ నవాబ్ రిపోర్టింగ్ చేస్తుంటే చూసి ముచ్చట పడుతుంటారు. రిపోర్టింగ్ లో ఆయన చేసే ఫీట్లు తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. తన ప్రత్యేకమైన రిపోర్టింగ్ స్టైల్ కారణంగా..

Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Pakistani Journalist
Follow us on

పాకిస్తాన్ జర్నలిస్ట్ (Pakistani journalist) చాంద్ నవాబ్ (journalist Chand Nawab) ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాడు. కరాచీలోని వాతావరణంపై (Karachi weather) ఆయన రిపోర్ట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాద్యామాల్లో తెగ వైరల్‌గా (viral video) మారింది. పాకిస్తాన్‌లో చాంద్ నవాబ్ గురించి పెద్దగా పరిచయం ఉందో లేదో తెలియదు కానీ ఆయన రిపోర్టింగ్ అంటే భారత్ లో మాత్రం భారీ ఫ్యాన్స్ ఉన్నారు. చాంద్ నవాబ్ రిపోర్టింగ్ చేస్తుంటే చూసి ముచ్చట పడుతుంటారు. రిపోర్టింగ్ లో ఆయన చేసే ఫీట్లు తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. తన ప్రత్యేకమైన రిపోర్టింగ్ స్టైల్ కారణంగా సోషల్ మీడియాలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అతని తాజా కరాచీలో వెదర్ రిపోర్టింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు మరోసారి తెరమీదికి వచ్చింది. శీతాకాలంలో వీస్తున్న గాలులపై ఆయన చేస్తున్న రిపోర్టింగ్ చూడవచ్చు.

కరాచీలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చల్లని గాలి వీస్తోంది. ఈ తుపానును చూసేందుకు ప్రజలు రావచ్చు. ఈ తుఫాను నుండి జుట్టు ఎగిరిపోతుంది. నా నోటిలో ధూళి పోతోంది. ఆ సమయంలో ఆయన కూడా కళ్లు తెరవలేకపోయారు. సన్నగా, బలహీనంగా ఉన్నవారు ఈ బీచ్‌కు రావద్దని.. వస్తే ఈ ఇక్కడ వీస్తున్న గాలికి ఎగిరిపోతారని.. ఇలా కొనసాగిస్తున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. మధ్యలో ఇలాంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాడం కోసం  మధ్యప్రాచ్యానికి వెళ్లాల్సిన అవసరం లేదని.. కరాచీకి వస్తే సరిపోతుందని అనటం అంతా షాకయ్యారు. అప్పటి వరకు ఇక్కడికి ఎవరూ రావద్దని చెప్పిన ఆయన ఒక్కసారిగా రివర్స్‌లో చెప్పడంతో అంతా నవ్వుకుంటున్నారు. ఇలా రిపోర్టింగ్ చేస్తూ.. ఒంటెపై కూర్చొని వాతావరణంపై రిపోర్టింగ్ చేయడం మొదలు పెడుతాడు. ఇందులో  “ప్రస్తుతం నేను ఏ అరేబియా ఎడారిలో లేను.. కరాచీ సముద్ర తీరంలో ఉన్నాను. ఈరోజు కరాచీలో దుబాయ్, సౌదీ అరేబియా వంటి దుమ్ము తుపాను సంభవించవచ్చు” అని పేర్కొన్నారు.

కరాచీలోని వాతావరణాన్ని చాంద్ నవాబ్ రిపోర్టింగ్ చేస్తుండగా జర్నలిస్ట్ నైలా ఇనాయత్ వీడియోను ట్వీట్ చేశారు. “చంద్ నవాబ్ కరాచీలో దుమ్ముతో కూడిన చల్లని గాలుల గురించి నివేదిస్తున్నాడు. సన్న, బలహీనమైన వారు ఈ దుమ్ము తుపానుకు ఎగిరిపోయే అవకాశం ఉందని హెచ్చరించడం.. టైటిల్‌లో చూడొచ్చు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చూనిన నెటిజనం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చాంద్ నవాబ్ పాకిస్థాన్‌లో ప్రముఖ వీడియో జర్నలిస్ట్.. ARY న్యూస్‌కి ముందు.. కరాచీలో ఇండస్ న్యూస్‌లో పని చేసేవారు. మీరు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ చూసినట్లయితే అందులోని “నవాజుద్దీన్ సిద్ధిఖీ” జర్నలిస్ట్ ను గుర్తుకు తెస్తుంటాడు. గతంలో ఇతనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.

కూడా చదవండి: Vamika: వామిక ఫొటోలు నెట్టింట వైరల్.. కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ..!

Indian Navy SSC Officer IT Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!