Telugu News Trending Painting on Head video was gone viral in social media Telugu news
Viral Video: లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. ఈ కళా నైపుణ్యానికి వావ్ అనాల్సిందే
ఈ సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ (Talent) ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్రాయింగ్ ఆర్టిస్ట్ ల (Artist) గురించి. వేల మాటల్లో చెప్పలేని భావాలనూ ఒక పెయింటింగ్ ద్వారా చెప్పవచ్చు. సాధారణంగా పేపర్...
ఈ సువిశాల ప్రపంచంలో ట్యాలెంట్ (Talent) ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్రాయింగ్ ఆర్టిస్ట్ ల (Artist) గురించి. వేల మాటల్లో చెప్పలేని భావాలనూ ఒక పెయింటింగ్ ద్వారా చెప్పవచ్చు. సాధారణంగా పేపర్ పై పెన్, కలర్ పెన్సిల్స్, స్కెచ్, వాటర్ కలర్స్ ఇలా వివిధ రకాల పరికరాలతో బొమ్మలు గీస్తారు. మరికొందరు బ్లాక్ బోర్డుపై, ఇంకొందరు డ్రాయింగ్ షీట్స్ పై అందమైన చిత్రాలు గీస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా పెయింటింగ్ వేసుకుంటూ తనలోని అసమాన ప్రతిభను చూపుతున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వ్యక్తి తన తలపై అద్భుతమైన కళాకృతిని వేసి చూపించాడు. వాటిని చూస్తుంటే సహజత్వం అనిపించేలా భ్రమ కలిగిస్తుంది. సగం తల లేనట్టుగా, పుర్రె పూర్తిగా తెరిచి, దాని లోపలి నుంచి కార్టూన్ పాత్ర చూస్తున్నట్లు, నాలుగు కళ్ళు ఉన్నట్లు, తల ఒక కుండలా మారినట్లు.. ఇలా వివిధ రకాలుగా చిత్ర విచిత్రమైన డ్రాయింగ్ వేసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు.
— Morissa Schwartz (Dr. Rissy) (@MorissaSchwartz) July 31, 2022
ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 33 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 28 వేలకు పైగా వీక్షించారు. వందలాది మంది లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని అందంగా, మరికొందరు అద్భుతంగా పేర్కొన్నారు.