Viral Video: నెక్ట్స్ లెవల్‌ టాలెంట్‌ ఇది .. గాల్లో ఎగరావొచ్చు.. నీటిలో ఈత కూడా తెలుసు.. ఇది నేనే నండోయ్‌..!

|

Jun 03, 2023 | 2:45 PM

గుడ్లగూబ ఒక కెనాల్‌  లాంటి నీటి ప్రవాహంలో ఈత కొట్టడం కనిపిస్తుంది.. అనుభవజ్ఞుడైన స్విమ్మర్‌లా గుడ్లగూబ ఆ కెనాల్‌ గుండా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. సుమారు వెయ్యి మందికి పైగా దీన్ని లైక్ చేసారు. దీనితో పాటు, వినియోగదారులు కామెంట్ల ద్వారా వివిధ రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Viral Video: నెక్ట్స్ లెవల్‌ టాలెంట్‌ ఇది .. గాల్లో ఎగరావొచ్చు.. నీటిలో ఈత కూడా తెలుసు.. ఇది నేనే నండోయ్‌..!
Owl Swimming
Follow us on

గుడ్లగూబల గురించి వినే ఉంటారు. అవి రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఇక్కడో గుడ్లగూబ స్వభావం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది రాత్రిపూట మాత్రమే కాదు.. పగటిపూట కూడా కనిపిస్తుంది. కానీ, అది ఎగురుతూ, తలక్రిందులుగా వేలాడు మాత్రమే కాకుండా నీటిలో ఈత కొట్టడం కూడా చేస్తుంది. అదేంటి గుడ్లగూబ ఈత కొట్టడం ఎంటని ఆశ్చర్యపోతున్నారు కదా.. గుడ్లగూబ నీటిలో ఈదటం ఏంటని మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు కూడా. అయితే ఇది సాధ్యమే..! అంటోంది ఇక్కడో గుడ్లగూబ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇందుకు సాక్షం. ఈ వీడియోలో ఒక గుడ్లగూబ ఎగిరి గంతేసే బదులు.. నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ఈ క్లిప్ ఫిగెన్ (@TheFigen_) అనే ఖాతా ద్వారా Twitterలో షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియోలో.. గుడ్లగూబ ఒక కెనాల్‌  లాంటి నీటి ప్రవాహంలో ఈత కొట్టడం కనిపిస్తుంది.. అనుభవజ్ఞుడైన స్విమ్మర్‌లా గుడ్లగూబ ఆ కెనాల్‌ గుండా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. అయితే, ఈ వీడియో చూస్తుంటే ఆ గుడ్లగూబ పొరపాటున నీటి కెనాల్‌ పడిపోయిందనే సందేహం కలుగుతుంది. రెక్కల్లో నీరు చేరి ఆ పక్షికి ఎగరడమే కష్టంగా మారి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఇది చూసి జనాలు రకరకాల అంచనాలు వేస్తున్నారు. గూడులోంచి నీటికుంటలో పడిపోయిందని కొందరు అంటున్నారు. గుడ్లగూబ నీటి నుండి నేరుగా ఎగరదు కాబట్టి, దాని ఈకల నుండి నీటిని తీసివేసిన తర్వాత అది ఎగరగలిగేలా పొడి ప్రదేశానికి ఈత కొట్టాలని నిర్ణయించుకుంది. ఈ వీడియో అమెరికాలోని అరిజోనా, ఉటా రాష్ట్రాల మధ్య ఉన్న లేక్ పావెల్‌లో చిత్రీకరించినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

జూన్ 1న పోస్ట్ చేసిన ఈ వీడియోకి 44 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. సుమారు వెయ్యి మందికి పైగా దీన్ని లైక్ చేసారు. దీనితో పాటు, వినియోగదారులు కామెంట్ల ద్వారా వివిధ రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గుడ్లగూబలు కూడా ఈత కొట్టగలవని నాకు తెలియదంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..