Optical illusion Test: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ఇవి చూడటానికి బాగానే కనిపిస్తున్నప్పటికీ.. దానిలో దాగున్న విషయాలు తికమకపెడుతుంటాయి. చిత్రంలో ఏదో ఉన్నట్టుగా.. ఇంకా లేనట్టుగా.. మరేదో కనికట్టులా మనల్ని మాయలో పడేస్తుంటాయి. ఈ చిత్రాలు ముఖ్యంగా చూసే వాటికంటే భిన్నంగా ఉండటంతోపాటు మన చూపును, మెదడును షార్ప్ చేస్తుంటాయి. అందుకే చాలామంది.. రిలాక్స్ కోసం వీటిలో దాగున్న విషయాలను కనుగొనేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా..? అనిపించేలా ఈ చిత్రాలు కనిపిస్తుంటాయి. తాజాగా.. ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో నెటిజన్లు అందరినీ తికమకపెడుతోంది. ఈ చిత్రంలో మూడు కప్పలు దాగున్నాయి. వాటిని జస్ట్ 7 సెకన్లలో కనుగొంటే.. మీ మైండ్ షార్ప్ గా ఉన్నట్లేనని నెటిజన్ సవాల్ చేశాడు.
ఈ కింద ఇచ్చిన ఫొటో ఒసారి క్షుణ్ణంగా పరిశీలించండి.. దీనిలో ఎండిపోయిన ఆకులు కనిపిస్తున్నాయి. ఈ ఆకుల మధ్య మూడు కప్పలు దాగున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏడు సెకన్లలో కనిపెట్టాలి. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి..
ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో
ఈ ఛాయాచిత్రాన్ని అర్బన్ అంబ్రోజిక్, గ్రెగోరీ ప్లాంటార్డ్ తీశారు. వాస్తవానికి ఈ చిత్రం చూస్తే ఆకులు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అందులో ఉన్న కప్పలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా ఈ చిత్రాన్ని చూడగానే.. మొదటగా రెండు కప్పలు కనిపిస్తాయి. కానీ.. ఇంకొంచెం పరిశీలిస్తే.. మరో కప్ప కూడా కనిపిస్తుంది.
అయితే.. ఏడు సెకన్లలో మీరు కప్పలను గుర్తించారా..? గుర్తించకపోతే మరోసారి ట్రై చేయండి.. ఒకసారి కింద నుంచి పైకి.. ఇరువైపులా ఒకసారి చిత్రాన్ని పరిశీలించండి..
ఇంకా మీకు కప్పలు కనిపించలేదా..? అయితే.. ఈ కింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మీకు నచ్చితే.. మీ స్నేహితులకు షేర్ చేసి సవాల్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..