Optical illusion: చిత్రం భళారే విచిత్రం.. టైం ఎంతైనా పర్లేదు.. దీనిలో ఉన్నది పురుషుడా లేక మహిళనా..? లేదా

|

Aug 12, 2022 | 11:54 AM

ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లు మనం చూసే వాటికి భిన్నంగా ఉంటాయి. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా..? అనిపించేలా ఈ చిత్రాలు ఉంటాయి. తాజాగా, ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ నెటిజన్లు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Optical illusion: చిత్రం భళారే విచిత్రం.. టైం ఎంతైనా పర్లేదు.. దీనిలో ఉన్నది పురుషుడా లేక మహిళనా..? లేదా
Optical Illusion Test
Follow us on

Optical illusion Test: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవి చూడటానికి మంచిగా ఉన్నప్పటికీ.. సరికొత్త విషయాలతో మనల్నే ఆశ్చర్యపరుస్తాయి. ఉన్నా.. లేనట్టుగా, ఏదో కనికట్టులా మన కళ్లన్ని మెదడును తిమ్మిరి బమ్మిని చేస్తుంటాయి. అందుకే సవాల్ చేస్తున్న చిత్రాల్లో దాగున్న విషయాలను కనుగొనేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లు మనం చూసే వాటికి భిన్నంగా ఉంటాయి. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా..? అనిపించేలా ఈ చిత్రాలు ఉంటాయి. తాజాగా, ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ నెటిజన్లు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంలో కొనుగొనాల్సి ఏంటంటే..? ఫొటోలో పురుషుడిని, లేదా మహిళను చూస్తున్నారా..? లేదా ఇద్దరినీ చూస్తున్నారా అనేది గుర్తించాలి.

మనస్సును కదిలించే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ‘మాస్క్ ఆఫ్ లవ్’ పేరుతో వెనీషియన్ ముసుగును వర్ణిస్తుంది. దీనిని బెస్ట్ ఇల్యూషన్ ఆఫ్ ది ఇయర్ కాంటెస్ట్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు. దీనిని 2011లో జియాని సర్కోన్, కోర్ట్నీ స్మిత్, మేరీ-జో వేబెర్ రూపొందించారు.

ఈ కింద ఇచ్చిన వెనీషియన్ మాస్క్ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని నిశితంగా పరిశీలించండి..

ఇవి కూడా చదవండి

Viral Pic

ఆప్టికల్ భ్రమను 2011లో జియాని సర్కోన్, కోర్ట్నీ స్మిత్, మేరీ-జో వేబెర్ రూపొందించారు. అయితే.. దీనిలో మీరు ఏం చూశారు.. పురుషుడు, మహిళనా..? లేదా ఇద్దరూనా.? అయితే.. దీనిలో టైం అంటూ ఏం లేదు. మళ్లీ ఒకసారి ట్రై చేయండి..

Optical Illusion Test

అయితే.. చాలామంది పురుషుడి ముఖాన్ని చూశామని.. స్త్రీ ముఖం లేదని పేర్కొంటున్నారు. అయితే, అది అలా కాదు. మీరు మాస్క్‌ని నిశితంగా పరిశీలిస్తే అందులో రెండు విభిన్న ముఖాలు.. పురుషుడు, మహిళ ఇద్దరూ కనిపిస్తారు. ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడాన్ని చూడవచ్చు.

ఇప్పటికీ మహిళను గుర్తించలేకపోయారా..? అయితే ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Optical Illusion

ఈ చిత్రంలో ఒక పురుషుడు, మహిళ ముఖాలను రంగుల ఆకృతితో వేరు చేశారు. అవి రెండు విభిన్న ముఖాలను గుర్తించిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మీకూ నచ్చితే.. ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఆశ్చర్యపర్చండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..