Viral Picture: మీ కళ్లకి ఒక పరీక్ష..ఈ ఫొటోలో ఉన్న దానిని కనిపెడితే మీరు జీనియస్..!

|

Mar 20, 2022 | 6:09 AM

Viral Picture: మీరు ఆప్టికల్ ఇల్యూషన్ అనే పేరు వినే ఉంటారు. దీని చరిత్ర చాలా పాతది. ఇందులో కంటికి కనిపించేది ఒకటి ఉంటే కనిపించనిది మరొకటి ఉంటుంది. ఇది

Viral Picture: మీ కళ్లకి ఒక పరీక్ష..ఈ ఫొటోలో ఉన్న దానిని కనిపెడితే మీరు జీనియస్..!
Viral Picture
Follow us on

Viral Picture: మీరు ఆప్టికల్ ఇల్యూషన్ అనే పేరు వినే ఉంటారు. దీని చరిత్ర చాలా పాతది. ఇందులో కంటికి కనిపించేది ఒకటి ఉంటే కనిపించనిది మరొకటి ఉంటుంది. ఇది మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో తెలియజేస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ మిస్టరీని ఛేదించడం అంత సులువైన పనికాదు. దీని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఫొటోని ఎక్కువ సార్లు గమనిస్తే తప్పించి మీరు అందులో ఏముందో తెలుసుకోలేరు. ఇప్ప్పుడు అలాంటి ఒక ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. వాస్తవానికి ఈ చిత్రంలో మొదట ఒక వ్యక్తి ఏదో చూస్తున్నట్లుగా స్కెచ్ వేశారని అర్థమవుతోంది. మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే వేరే విషయం దాగుందని అర్థమవుతుంది. ఇంకా దగ్గరగా పరిశీలిస్తే దానిపై రాసి ఉన్న పదం LIAR అని తెలుస్తుంది.

ఈ పదాన్ని గుర్తించడానికి మీరు మీ తలని కొద్దిగా కుడి వైపుకు వంచాలి. కళ్ళు, ముక్కు L రూపంలో ఉంటాయి. ముక్కు I వలె గీసారు. పెదవులు A రూపాన్ని తెలుపుతున్నాయి. గడ్డం నుంచి గొంతు వరకు R రూపాలను సూచిస్తున్నాయి. ఈ వైరల్‌ పిక్చర్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ పోస్టుకి క్యాప్షన్‌గా ‘ఈ చిత్రంలో మీరు మొదట ముఖం చూస్తారు కానీ అది అబద్దం’ అని రాశారు. ఈ వైరల్ చిత్రం ఇప్పటివరకు 1,600 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. రెండు వందల యాభై మందికి పైగా చిత్రాన్ని రీట్వీట్ చేశారు. వాస్తవానికి ఈ పిక్చర్‌లో దాగున్న పదాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఈ చిత్రం చూసిన నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారి ఇలాంటి చిత్రాన్ని చూశామని చెబుతున్నారు. మరికొందరు ఎవ్వరూ అలా తల పక్కకు తిప్పుకొని చూడరని ఎద్దేవా చేస్తున్నారు.

Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Rahul Gandhi: ద్వేషం, కోపం రంగాల్లోనూ భారతదేశానికి త్వరలోనే అగ్రస్థానం.. కేంద్రంపై రాహుల్ వంగ్యాస్త్రాలు!