పజిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. బుర్రను కాస్త యాక్టివ్ చేయడంతో పాటు మంచి టైమ్ పాస్ అవుతుంది. ఇక పజిల్స్ అంటే పాత కాలంలోలాగా.. బుక్స్‌లో వచ్చే పదాలకు సంబంధించినవే కాదండోయ్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం వచ్చింది. అందులో సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల మీమ్ పేజీలు మెయింటైన్ చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. అలానే పజిల్స్ అందించేందుకు కూడా కొందరు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నారు. మన విజన్ పవర్ ఎంత ఉంది…? మెదడు ఎంత ఇస్మార్ట్‌గా పనిచేస్తుంది అనేది ఈ పజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
తాజాగా మీ ముందుకు అలాంటి కిక్ ఇచ్చే పజిల్ తీసుకొచ్చాం. పైన ఫోటోను జాగ్రత్తగా గమనించండి. హా.. ఓ చెట్టు మొదలు ఉంది. గడ్డి మొక్కలు ఉన్నాయి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది ఓ కుందేలు. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ టాస్క్. ఎంత తక్కువ టైమ్‌లో మీరు కనిపెడతారనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మీ ఐ పవర్ ఏ మాత్రం ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. టెన్షన్ పడి.. హడావిడిగా వెతికితే అది కనిపించదు. కూల్‌గా ఆ ఫోటో మొత్తాన్ని పరిశీలిస్తే.. ఈజీగా మీరు ఆ కుందేలును పట్టగలరు.
ఏంటి ఇంకా కనిపిట్టలేదా..? ఏంటండీ బాబు… ఇది చాలా ఈజీ పజిలే కదా..! సర్లే ఇక సమాధానం ఇక మేమే ఇచ్చేస్తున్నాం. ఇకపై ఇలాంటి పజిల్స్ తారసపడ్డప్పుడు కాస్త దిమాక్ పెట్టి వెతకండి. మీరే విన్నర్ అవుతారు.
రిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..