Photo Puzzle: మీకే విసరుతున్నాం సవాల్.. ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టగలరా..?

|

Apr 15, 2024 | 3:48 PM

మనల్ని మభ్యపెట్టే చిత్ర విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో తరుచూ వైరల్ అవుతుంటాయి. ఎన్నో రకాల ఫోటోలు మనల్ని ప్రతీసారి ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటిదే ఈ ఫోటో.. పైన ఫోటోలో సింహం ఎక్కడుందో మీరు చెప్పాలి.? మీరు ఫోటోను ఫస్ట్ టైం చూసిన వెంటనే అసలెక్కడుందో గుర్తించలేరు.

Photo Puzzle: మీకే విసరుతున్నాం సవాల్.. ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టగలరా..?
Photo Puzzle
Follow us on

ప్రజంట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, స్నాప్ చాట్ వంటివి.. సొసైటీని  ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏజ్‌తో పని లేదు, జెండర్ డిఫరెన్సులు అస్సలు లేవు. అందరూ  సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. అయితే ప్లాట్ ఫామ్స్‌లో ఈ మధ్య పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని అంతు తేల్చేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని లెక్క తేల్చేవరకు విశ్రమించరు. పజిల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందిస్తాయి. మెదడును యాక్టివ్ చేస్తాయి. ఇంకొన్ని పజిల్స్ మీ ఐ ఫోకస్ తెలుసుకునేంుదకు సాయపడతాయి. ‘ఈ ఫోటోలో ఉన్న యానిమల్‌ను గుర్తించండి’.. ‘ఈ చిత్రంలో పాము ఎక్కడ ఉంది’ లాంటి ఫోటో పజిల్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఈజీగా ఉన్నా. మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. వీటిని సాల్వ్ చేయాలంటే మీ ఫోకస్ సరిగ్గా ఉండాలి. కొద్దిగా పొరపడినా ఇవి మిమ్మల్ని విసిగిస్తాయి. అయితే సదరు ఫోటోలోని ఆన్సర్ కనిపెడితే.. సూపర్ కిక్ వస్తుంది.

అలా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ఫోటో పజిల్‌ను మీ ముందుకు తెచ్చాం. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పర్వత సింహం దాగుంది. అక్కడి పర్వతాల రంగులో అది ఇమిడిపోవడం వల్ల.. దాన్ని కనిపెట్టడం పెద్ద సవాల్.   నూటికి 90 శాతం మంది ఈ పజిల్‌కు ఆన్సర్ కనిపెట్డంలో విఫలమయ్యారు. ఫోటోలోని సింహాన్ని కొద్ది సమయంలోనే కనిపెట్టారంటే మీ కళ్లు అద్భుతమైన ఫోకస్‌తో ఉన్నట్లే లెక్క. మీరు ఆ సింహాన్ని కనిపెట్టలేకపోతే సమాధానం కింద ఇచ్చాం చెక్ చేసుకోండి.

Mountain Lion

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..