Optical Illusion: ప్రపంచంలో అనేక చిత్ర విచిత్రాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని మనస్సు ‘ట్విస్ట్’ లో పడేటట్లు చేస్తాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి, ఆప్టికల్ ఇల్యూషన్ అంటే కళ్లను మోసం చేయడం.. వాస్తవానికి ఫొటోలో ఏదో దాగుంటుంది.. అందులో చూపరులకు మరేదో కనిపిస్తుంది. చిత్రంలో దాగున్న చిత్ర, విచిత్రాలను కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అవి అంత తేలికగా కనిపించవు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఫొటోలో మొక్కలు, గడ్డి, జంతువులు ఉన్న అడవి కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫొటోలో మరొక చిత్రం దాగుంది.. అదేమిటో తెలుసుకోవడం కోసం వెతికిన జనం విసిగిపోయారు. ఆ చిత్రంలో దాగున్న అమ్మాయిని కనుగొనవలసి ఉంటుంది. ఎంత త్వరగా కనుగొంటారు అనేది ఒక సవాల్. నిజానికి, గడ్డం ఉన్న వ్యక్తి చిత్రంలో ఎండిన చెట్లు, అడవులు, పర్వతాలు, పొదలు కనిపిస్తాయి. అయితే ఆ చిత్రంలోనే అసలు రహస్యం దాగి ఉంది. అంటే చిత్రం లోపల ఎక్కడో ఒక అమ్మాయి దాక్కుని కూర్చున్నట్లు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆప్టికల్ భ్రమతో ఈ చిత్రాన్ని స్విస్ చిత్రకారుడు సాండ్రో డెల్ ప్రీట్ రూపొందించారు.
చిత్రంలో దాగి ఉన్న అమ్మాయిని మీరు కనుగొనగలరా?
ఆప్టికల్ ఇల్యూషన్‌తో కొన్ని చిత్రాల్లో దాగి ఉన్న వస్తువులను కనుగొనడం సముద్రంలో సూదిని వెదకడంతో సమానం. అయితే ఈ చిత్రంలో అది అలా కాదు. మీరు జాగ్రత్తగా చూస్తే, చిత్రంలో దాగి ఉన్న అమ్మాయిని కనిపెట్టడం చాలా సులభం. అయితే దీని కోసం మీ మనసుని చూపుని ఫోటోపై లగ్నం చేయాలి. మనస్సును ఏకాగ్రతతో ఉంచుకోవాలి. అప్పుడే మీరు ఈ సవాలును పూర్తి చేయగలుగుతారు.
మీకు ఇప్పటికీ చిత్రంలో దాగి ఉన్న అమ్మాయి కనిపించకపోతే.. ఈ చిట్కాలను పాటించండి. గుండ్రటి టోపీ ధరించి ఒక సొగసరి అమ్మాయి కూర్చొని ఉంది. ఇప్పటికీ ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోతే.. చిత్రంలో వ్యక్తి ముక్కుని పరిశీలించండి.. వీపుని వయ్యారంగా కూర్చున్న అమ్మాయి మీకు కనిపిస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..