మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా..? అయితే తికమక పెట్టే ఫోటో పజిల్స్ తారసపడే ఉంటాయ్. వీటిపై ఇప్పుడు నెటిజన్లు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు.. మనల్ని మాయ చేస్తాయి ఇవి. మన బుర్ర ఎంత ఇస్మార్ట్, సునిశిత అంశాలపై మన ఫోకస్ ఎలా ఉంది.. మన కళ్ల ఫోకస్ ఏమాత్రం ఉంది వంటివి తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయ్. ఈ ఫోటోలో పాము నక్కి ఉంది కనిపెట్టగలరా.. ఈ చిత్రంలో విభిన్నంగా కనిపించే అక్షరం ఏంటి.. ఫోటోలో ఉన్న జంతువుఏంటి..? వంటి పజిల్స్ అనమాట. ఇలాంటి పజిల్స్ తో సలభం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. టైమ్ లిమిట్ లేకపోతే.. ప్రశాంతంగా వెతికి వాటి ఆచూకి పట్టొచ్చు. కానీ ఇంత సమయంలో కనుగొనాలి అంటేనే అసలు తిరకాసు మొదలవుతుంది. హడావిడిలో తప్పులో కాలేస్తారు. తాజాగా అలాంటి ఓ క్రేజీ పజిల్‌ను మీ ముందుకు తెచ్చాం.
పైన ఉన్న ఫోటోను నిశితంగా గమనించండి. ఓ చెట్టును బాగా ఫోకస్ చేశారు. అక్కడ ఓ గుడ్లగూబ కూడా ఉందండోయ్. ఆ చెట్టు బెరడు రంగులో అది ఇమిడిపోయింది. దాన్ని కేవలం 10 సెకన్లో ఎక్కడుందో కనిపెట్టాలి. మరీ కష్టమైన పజిల్ అయితే కాదు.. అందుకే అంత తక్కువ సమయం ఇచ్చాం.
మంచి ఐ ఫోకస్ ఉన్నవారు గుడ్లగూబ చాలామంది పట్టేసే ఉంటారు. దాన్ని కనుగొనలేని వారు నో వర్రీస్. ఆన్సర్ ఉన్న ఫోటోను మేము కింద ఇస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి పజిల్ ఇచ్చినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా వెతకండి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.