వారెవ్వా.. ఏం టాలెంట్ బ్రో.. వధువు డ్యాన్స్‌ కోసం ఓలా స్కూటర్‌తో దేశీ జుగాడ్.. అద్దిరిపోయే మ్యూజిక్‌తో హంగామా..

|

Jan 13, 2024 | 1:04 PM

అయితే, కొన్ని ప్రదేశాలలో 10 తర్వాత DJలు, పెద్ద సెద్ద మ్యూజిక్‌లు ప్లే చేయడం నిషేధించబడింది. కాదని సౌండ్స్‌ ఆపకుంటే స్థానిక పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈరోజు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామ్‌లో పాటలను కొనసాగించడానికి ఇక్కడ కొంతమంది స్నేహితులు పెద్ద జుగాడ్‌ ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే...

వారెవ్వా.. ఏం టాలెంట్ బ్రో.. వధువు డ్యాన్స్‌ కోసం ఓలా స్కూటర్‌తో దేశీ జుగాడ్.. అద్దిరిపోయే మ్యూజిక్‌తో హంగామా..
Bride Dance
Follow us on

పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి వేడుక ఏదైనా సరే.. డెక్కులు, DJలు వంటి పెద్ద పెద్ద సౌండ్‌ సిస్టమ్స్‌ తో హంగామా చేస్తుంటారు. చాలా మంది. ఇలాంటి భారీ శబ్ధాలు, అల్లర్ల నేపథ్యంలో DJ సౌండ్ల పరిమితి సమయం వరకు ప్లే చేసుకోవటానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని ప్రదేశాలలో 10 తర్వాత DJలు, పెద్ద సెద్ద మ్యూజిక్‌లు ప్లే చేయడం నిషేధించబడింది. కాదని సౌండ్స్‌ ఆపకుంటే స్థానిక పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈరోజు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామ్‌లో పాటలను కొనసాగించడానికి ఇక్కడ కొంతమంది స్నేహితులు పెద్ద జుగాడ్‌ ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే…

ఒక ఇంట్లో పెళ్లి వేడుక మొదలవుతుంది. అదే రోజు హల్దీ, సంగీత్‌ కార్యక్రమం జరుగుతుంది. అలా పెళ్లికూతురు పసుపుకుంకుమ పెట్టుకునే సమయానికి డీజే టైం దాటిపోయి రాత్రి 11 గంటలకు సంగీత్ కార్యక్రమం మొదలై అర్థరాత్రి ఒంటిగంట వరకు డీజే మెల్లగా ప్లే అవుతోంది. కానీ, తర్వాత పోలీసు అధికారులు రావడంతో డీజేను ఆపాల్సి వచ్చింది. ఈలోగా వధువు డ్యాన్స్‌ చేయటం మాత్రమే మిగిలింది. అందుకే వధువు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం స్పెషల్ జుగాడ్ ఏం చేశారో కూడా వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ స్నేహితుడు ఓలా స్కూటర్‌ని తీసుకొచ్చి దాంతో స్పెషల్గా మ్యూజిక్‌ ప్లే చేశారు. అలా వధువు డ్యాన్స్‌ పూర్తి చేసింది. అలాగే పెళ్లిలో డ్యాన్స్ చేయాలనే వధువు కోరిక కూడా నెరవేరింది. వైరల్ అయిన వీడియోలో వేదికపై వధువు డ్యాన్స్ చేస్తుండగా వారి స్నేహితుడు ఓలా కంపెనీ స్కూటర్‌తో వేదిక ముందు నిలబడి ఉన్నారు.

ఈ వీడియో @saurav_rokade_ssr_official మరియు @khushawart_tupe2717 యొక్క Instagram ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన తర్వాత, Ola CEO భవిష్ అగర్వాల్ తన అధికారిక X (ట్విట్టర్)లో ఈ వీడియోను షేర్‌ చేశారు. చార్ బాజ్ గయే లకిన్ పార్టీ అభి బాకీ హై! హ హ హ…! భారతదేశంలో ఓలా స్కూటర్లు పబ్లిక్ వేడుకలో భాగమయ్యాయని చూడటం చాలా బాగుంది; అంటూ ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..