
న్యూయార్క్‌లోని ఈస్ట్ విలేజ్‌లో ఒక విద్యార్థి 100 చదరపు అడుగుల మైక్రో అపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అపార్ట్‌మెంట్ చాలా చిన్నది. ఎంత చిన్నగా ఉంటుందంటే..ఒకేసారి ఇద్దరు వ్యక్తులు లోపల హాయిగా నిలబడలేరు. కానీ, ఆ ఇంటి అద్దె తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గదిలో మంచం మీద టీవీ, పక్కనే చిన్న వంటగది, షేర్డ్ బాత్రూమ్ ఉన్నాయి.
ఈ వీడియోను అక్సెల్ వెబర్ అనే యువకుడు తన అనుభవాన్ని చెప్పాడు. దీనిని మొదటిసారి 2021లో షేర్ చేశారు. కానీ, 2025లో కూడా దీనికి 24 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 22 ఏళ్ల అక్సెల్ ఒక మ్యూజిక్ స్టూండెట్, అతను ఇప్పుడే మొదటిసారి న్యూయార్క్ నగరానికి వెళ్లాడు. మాన్‌హట్టన్‌లోని ఈస్ట్ విలేజ్ నడిబొడ్డున ఉన్న అతని 100 చదరపు అడుగుల (సుమారు 9 చదరపు మీటర్లు) అపార్ట్‌మెంట్ NYCలో అతి చిన్నది అనే గుర్తింపు సంపాదించింది. ఈ గదిలో నివసించడం అంత సులభం కాదు, కానీ విద్యార్థులు అలాంటి గదుల్లో నివసించవలసి వస్తుంది.
మేము అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వెంటనే తలుపు తెరవడం కష్టంగా అనిపించింది. స్థలం చాలా పరిమితంగా ఉంది. పూర్తిగా తెరవడం కూడా ఒక సవాలుగా ఉంది. టీవీని మంచం మీదనే ఉంచారు. ఇది కాకుండా పై బెర్త్‌లో సామాను నిల్వ చేయడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. వంటగదిలో ఒక చిన్న ఇండక్షన్ కుక్కర్ మాత్రమే ఉంది. పక్కన ఒక చిన్న సింక్ ఉంది. వంటగదిలో ఒక చిన్న రిఫ్రిజిరేటర్ ఉంది. మనం బాత్రూమ్ గురించి మాట్లాడుకుంటే, అది షేరింగ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ చిన్న గదిలో ఒక వ్యక్తి నివసిస్తున్నట్లు కనిపించింది.
వీడియో ఇక్కడ చూడండి..
ఇంటి పరిస్థితిని చూసి, అద్దె ఆదా చేసుకోవడానికి ఆ వ్యక్తి అలాంటి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ, దాని అద్దె గురించి అడిగినప్పుడు, అతని సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ చిన్న గదికి ఆ వ్యక్తి $1100 లేదా దాదాపు 97 వేల రూపాయలు చెల్లిస్తాడు. కోవిడ్ తర్వాత, ఆ ప్రాంతంలో అద్దె తగ్గింది. కానీ, 2025లో తిరిగి ఊపందుకుంది.. భారతదేశంతో పోలిస్తే, NYC అద్దె భారతదేశ మెట్రో కంటే 10 రెట్లు ఎక్కువ. కానీ, అక్కడ జీతం కూడా ఎక్కువగానే ఉంది. విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలతో మేనేజ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..