Kim Jong un: కిమ్‌ టాయిలెట్‌కు సెక్యూరిటీ గార్డ్స్‌.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..

|

Jan 31, 2022 | 12:53 PM

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ ( Kim Jong Un)  స్టైలే వేరు. ఓవైపు దేశం ఆర్ధికసంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్‌, దక్షిణకొరియా (South Korea) దేశాలకు సవాల్‌ విసురుతుంటాడు.

Kim Jong un:  కిమ్‌ టాయిలెట్‌కు సెక్యూరిటీ గార్డ్స్‌.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Kim Jong Un
Follow us on

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్ ఉన్ ( Kim Jong Un)  స్టైలే వేరు. ఓవైపు దేశం ఆర్ధికసంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్‌, దక్షిణకొరియా (South Korea) దేశాలకు సవాల్‌ విసురుతుంటాడు. అంతేకాదు.. లోకమంతా ఒక తీరుంటే తామెప్పుడూ తేడా అని ఎప్పటికప్పుడు చాటుకునేందుకు ఏమాత్రం మొహమాట పడడు ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్‌. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. అయితే తాజాగా కిమ్‌ జోంగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కిమ్ జాంగ్ ఉన్ తన వ్యక్తిగత మెర్సిడెస్‌ బెంజ్ కారులో ప్రత్యేకమైన టాయిలెట్‌ను తయారు చేయించుకున్నాడట. వాస్తవానికి కిమ్ జోంగ్ ఉన్ ఎవరినీ నమ్మడు. ఆఖరికి తన నీడను కూడా తాను విశ్వసించడు. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా.. తనతో పాటు తన వ్యక్తిగత టాయిలెట్‌ని కూడా తీసుకెళ్లిపోతాడు. ఆ టాయిలెట్ కుండీ శత్రువుల చేతికి చిక్కితే.. తన ప్రాణాలకే ప్రమాదమని కిమ్ భావిస్తాడు. ఆ కుండీ ద్వారా తన గురించి చాలా రహస్యాలు బయటకు వెళ్లే ప్రమాదముందని భయపడతాడు.

బలహీనతలు బయటపడకూడదని..

కాగా కిమ్ జోంగ్‌కు చాలా మంది బాడీ గార్డ్స్ ఉంటారు. వారు కేవలం కిమ్‌పైనే కాదు.. ఆయన ఉపయోగించే టాయిలెట్స్‌పైనా కూడా ప్రత్యేక నిఘా ఉంచుతారు. వాటికి ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఎవరైనా కిమ్ టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిస్తే.. మరుక్షణం ఆలోచించకుండా అతడికి మరణశిక్ష విధిస్తారట.  ఇక తన టాయిలెట్  కుండీ శత్రువులు తన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తాడట.  అదేవిధంగా  ఆయన బలహీనతలు కూడా తెలుసుకుంటారని కిమ్ అనుకుంటారట. అందుకే శత్రువులకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే.. తన టాయిలెట్‌ పాట్టీకి సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. ఈక్రమంలో కిమ్ ఎక్కడకు వెళ్లినా ఆయన వెంట ఈ కారు తప్పకుండా ఉండాల్సిందేనట.

Also read:KTR: కనీసం ఈ బడ్జెట్ లోనైనా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయండి.. కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి..

Health Tips: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

చరిత్రకు సాక్ష్యం జగిత్యాల కోట.. మీరు చూశారా ?