Squid Game: ‘స్క్విడ్ గేమ్’ రీక్రియేషన్….చిన్నారుల ప్రతిభకు నెటిజన్ల ఫిదా!

|

Oct 18, 2021 | 6:53 PM

‘స్క్విడ్ గేమ్’...ప్రత్యేక పరిచయం అవసరం లేని వెబ్ సిరీస్. నెల రోజుల క్రితం విడుదలైన ఈ సిరీస్

Squid Game: ‘స్క్విడ్ గేమ్’ రీక్రియేషన్....చిన్నారుల ప్రతిభకు నెటిజన్ల ఫిదా!
Squid Games
Follow us on

‘స్క్విడ్ గేమ్’…ప్రత్యేక పరిచయం అవసరం లేని వెబ్ సిరీస్. నెల రోజుల క్రితం విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం భారత్ తో పాటు పలు దేశాల్లో నంబర్ వన్ వెబ్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా కూడా ఇది గుర్తింపు పొందింది. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన మీమ్స్, ఫన్నీ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ గేమ్ సిరీస్ సహాయంతోనే ఇటీవల ముంబయి పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాధాన్యాన్ని వివరించిన తీరు చాలామందిని మెప్పించింది. ఇలా ‘స్క్విడ్ గేమ్’ ఆధారంగా ఏ ప్రయోగం చేసినా విజయవంతమవుతుండడంతో మరికొంతమంది ఇదే దారిలో పయణిస్తున్నారు.

ఒక్కరోజులోనే 10 లక్షల మంది చూశారు.!
తాజాగా నైజీరియాలోని కొంతమంది పిల్లలు ఈ సిరీస్ ను రీక్రియేట్ చేశారు. తమకు అందుబాటులో ఉన్న వస్తువులకు కాస్త క్రియేటివీటిని జోడించి ‘స్క్విడ్ గేమ్’ లోని కొన్ని సన్నివేశాలను అద్భుతంగా పేరడీ చేశారు. ముఖ్యంగా సిరీస్‌లోని రెడ్‌ లైట్, గ్రీన్‌లైట్‌ సన్నివేశాలను మలచిన తీరు, సెక్యూరిటీ గార్డు వేషాల్లో పిల్లలు అభినయించిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ‘ ikoroduలో స్క్విడ్ గేమ్‌ను తెరకెక్కిస్తే ఇలాగే ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. పలువురు నెటిజన్లు పిల్లల ప్రయత్నా్న్ని మెచ్చుకుంటున్నారు. ‘సూపర్‌..అమేజింగ్‌ వీడియో’, ‘చిన్నారుల ప్రతిభ అద్భుతం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్ ప్రియులను ఆకట్టుకుంటోన్న ఈ స్వ్కిడ్‌ గేమ్‌ రీక్రియేషన్‌ వీడియోను మీరూ చూసేయండి మరి.

Read Also:  క్యాన్సర్‎ను జయించిన బాలుడు.. ఆస్పత్రి బయటకు వచ్చి తండ్రితో ఏం చేశాడంటే..

సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..