ఆ దేశంలో కొత్త జాతి విషపు తేలు.. 8 కళ్లు, 8 కాళ్లు ఉన్న తేలు.. శాస్త్రజ్ఞులు సైతం షాక్..

|

Mar 14, 2024 | 8:34 AM

అప్పుడప్పుడు కొన్ని జీవులు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఇవి శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి.  అలాంటి ఒక వింత జీవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది శాస్త్రవేత్తలను కూడా ఆలోచించేలా చేసింది. మీరు తేళ్లను చూసి ఉంటారు.. అయితే 8 కళ్ళు, 8 కాళ్ళు ఉన్న తేలును ఎప్పుడైనా చూసారా? థాయిలాండ్‌లోని ఫేట్‌చబురి ప్రావిన్స్‌లోని కెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో తాము కొత్త జాతి తేలును కనుగొన్నామని దీనికి రెండు కాదు ఏకంగా ఎనిమిది కళ్ళు , ఎనిమిది కాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల బృందం పేర్కొంది

ఆ దేశంలో కొత్త జాతి విషపు తేలు.. 8 కళ్లు, 8 కాళ్లు ఉన్న తేలు.. శాస్త్రజ్ఞులు సైతం షాక్..
Scorpion New Species
Follow us on

ఈ భూమి మీద  మానవులతో పాటు లక్షల జాతుల జంతువులు నివసిస్తున్నాయి. వీటిల్లో చాలా జీవుల గురించి మనకు తెలియదు. అయితే  పేర్లు తెలియని లేదా వినని అనేక ఇతర జంతువులు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని జీవులు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఇవి శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి.  అలాంటి ఒక వింత జీవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది శాస్త్రవేత్తలను కూడా ఆలోచించేలా చేసింది. మీరు తేళ్లను చూసి ఉంటారు.. అయితే 8 కళ్ళు, 8 కాళ్ళు ఉన్న తేలును ఎప్పుడైనా చూసారా?

థాయిలాండ్‌లోని ఫేట్‌చబురి ప్రావిన్స్‌లోని కెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో తాము కొత్త జాతి తేలును కనుగొన్నామని దీనికి రెండు కాదు ఏకంగా ఎనిమిది కళ్ళు , ఎనిమిది కాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ కొత్త జాతి తేళ్లలో మూడు మగ, ఒక ఆడ తేళ్లను తాము గుర్తించి నట్లు.. అవి రాతి కింద దాగి ఉన్న వాటి నమూనాల ఆధారంగా కనుగొన్నామని పేర్కొన్నారు. వీటికి ఎక్కువ కళ్ళు, కాళ్ళు ఉన్నప్పటికీ సాధారణ తేళ్ల కంటే చిన్నవిగా ఉన్నాయని చెప్పారు. ఈ కొత్త జాతి తేలును యూస్కార్పియోప్స్ ఉపజాతిగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు ఈ తేళ్లకు కు వీటిని కనుగొన్న థాయ్‌లాండ్‌లోని జాతీయ ఉద్యానవనం పేరు మీదుగా యూస్కార్పియోప్స్ క్రాచన్ అని పేరు పెట్టారు.

రాళ్ల రంగులో ఉన్న తేళ్లు

మీడియా నివేదికల ప్రకారం  శాస్త్రవేత్తలు కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో వన్యప్రాణుల కోసం వెతుకుతున్నారు. ఇంతలో వారు రాళ్ల క్రింద దాక్కున్న గోధుమ రంగు, వెంట్రుకల జీవిని చూశారు. ఈ తేళ్ల రంగు ఖచ్చితంగా రాతి రంగు లాగా ఉంది.. కనుక మొదటి చూపులో రాళ్లకు , తేళ్ల మధ్య తేడాను గుర్తించడం కష్టమైందని పరిశోధకులు పేర్కొన్నారు. తొలుత ఆ తేళ్లను చూసిన శాస్త్రవేత్తలు.. ఏదో జీవి ఆహారం వెతుక్కుంటూ వెళుతోందని భావించారు. వాటి దగ్గరికి వెళ్లి నిశితంగా పరిశీలించగా.. అది తన నలుగురు పిల్లలను ఎత్తుకుని వెళ్తున్న ఆడ తేలు అని తెలిసింది.

ఇవి కూడా చదవండి

8 కళ్ళు, 8 కాళ్ళు ఉన్న జీవి

ఈ కొత్త జాతి తేళ్లు ఒక అంగుళం పొడవుతో పాటు చర్మంపై వెంట్రుకలను కూడా కలిగి ఉంది. అయితే వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వీటికి ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదిక ఇటీవల జూటాక్సా జర్నల్‌లో ప్రచురితమైంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..