IGI Airport Delhi: చేపల మార్కెట్‌ను తలపిస్తున్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్.. ఊపందుకున్న మీమర్లు..

దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో ప్రయాణికులకు అలాంటి ఇబ్బంది పరిస్థితే కలిగింది. ప్రయాణికులు చెక్-ఇన్ అయ్యేందుకు చాలా దూరం ఉన్న..

IGI Airport Delhi: చేపల మార్కెట్‌ను తలపిస్తున్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్.. ఊపందుకున్న మీమర్లు..
Indira Gandhi Airport Delhi

Updated on: Dec 20, 2022 | 12:08 PM

మన భారత్ సువిశాల దేశం కావడంతో ఇక్కడ ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి. మరి కొన్ని సందర్భాలలో అన్నీ అనుకూలంగానే ఉన్న బస్సు, రైలు, విమానం ఇలా అన్ని సరైన సమయాన్ని పాటించవు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో మీమర్లు ఊపందుకుంటారు. ఘటనను ప్రతిబింబించేలా మీమ్స్ వేస్తూ అందరినీ సరదగా నవ్విస్తారు.

అయితే దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో ప్రయాణికులకు అలాంటి ఇబ్బంది పరిస్థితే కలిగింది. ప్రయాణికులు చెక్-ఇన్ అయ్యేందుకు చాలా దూరం ఉన్న క్యూలను దాటాల్సి రావడంతో గందరగోళం ఏర్పడింది. ఇక గంటల తరబడి క్యూలలో ప్రయాణికులు నిలిచిపోవడంతో మీమ్‌ల వర్షం సోషల్ మీడియాను తాకింది. ఇక నెట్టింట వైరల్ అవుతున్న మీమ్‌లపై ఓ సారి లుక్కేద్దాం..

ఇవి కూడా చదవండి

కాగా, ప్రయాణికులు నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెనువెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. మంగళవారం T3 వద్ద పొడవైన క్యూల గురించి ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విమానాశ్రయంలో సజావుగా నిర్వహణ ఉండేలా అధికారులు సోమవారం ఒక ప్రణాళికను రూపొందించారు. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..