Viral Video: సోషల్‌మీడియా (Socialmedia) విస్తృతి పెరిగిన తర్వాత రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఐస్‌బకెట్, కికి, పిల్లో, ఎమోజీ చాలెంజ్ ఇలా ఇప్పటి వరకు ఎన్నో చాలెంజ్‌లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చాలెంజ్‌లను ఫాలో అవుతూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం బ్యాక్ ఫ్లిప్ పేరుతో నెట్టింట కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వెనక్కి జంప్ చేస్తూ కొంతమంది ఔత్సాహికులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొందరు మహిళలు చీర కట్టులో బ్యాక్ ఫ్లిప్ చేసిన వీడియోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి.
అయితే ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం. సాధారణంగా ఇలాంటి చాలెంజ్‌లు మనుషులే చేస్తారు. ఈ చాలెంజ్‌లను ఇతరులకు విసురుతుంటారు. అయితే ఓ పావురం బ్యాక్ ఫ్లిప్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అచ్చంగా మనుషుల్లాగే వెనక్కి జంప్ కొడుతూ ఆకట్టుకుంది. నిజంగానే ఎవరో చాలెంజ్ విసిరినట్లు బ్యాక్ ఫ్లిప్ చేసింది. సదరు పావురం జంప్ చేస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట చక్కర్లు కొడుతోంది. పావురం జంప్ చేస్తుండడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Don’t mind me and my bird flips with https://t.co/6rTo2sP1Sv ?pic.twitter.com/Qnh0s0vCWl
— Prisoners Dilemma Club (@prisonersdilem5) April 22, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య