Viral News: పురాతన ఇంట్లో బయటపడ్డ పాత ట్రంకు పెట్టె.. ఓపెన్ చేసి చూసి షాక్?

|

Aug 06, 2023 | 7:38 AM

ఒక వ్యక్తి కేవలం కలలు కనటం మాత్రమే కాదు.. తన కల ఊహించని విధంగా నిజమైంది. పాత సామాన్ల పెట్టేను సర్దు తుండగా భారీ నిధి దొరికింది. అతనికి 50-60 ఏళ్ల క్రితం తండ్రి కూడబెట్టిన నిధికి దొరికింది. అతని తండ్రి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. చిలీ పౌరుడు ఎక్సిక్విల్ హినోజోసా కథ ఇది. అతన్ని అదృష్టం వరించింది. ఉన్నపళంగా అతను కోటీశ్వరుడుగా మారాడు.  పాత సామాను సరిచేస్తుండగా తన తండ్రికి చెందిన పాత బ్యాంక్ పాస్ బుక్ దొరికింది. ఆ బ్యాంకు ఖాతా గురించి ఎవరికీ తెలియదు.

Viral News: పురాతన ఇంట్లో బయటపడ్డ పాత ట్రంకు పెట్టె.. ఓపెన్ చేసి చూసి షాక్?
Old Passbook
Follow us on

కాలం కలిసి రావాలి గాని బిచ్చగాడు సైతం కోటీశ్వరుడు అవుడాన్నది పెద్దలు చెప్పే మాట.. పురాతన తవ్వకాలు, పురావస్తు పరిశీలనల్లో తరచూ గుప్తనిధులు లభించటం మనం అనేక సార్లు వింటుంటాం. అలాంటి సమయంలో సదరు వ్యక్తుల అదృష్టం ఉన్నట్టుండి మెరిసిపోతుంది. రాత్రి రాత్రికే వారు కోటీశ్వరులగా మారిపోతుంటారు. ఈ కథలో కూడా అలాంటి మిరాకిల్‌ ఒకటి జరిగింది. ఒక వ్యక్తి కేవలం కలలు కనటం మాత్రమే కాదు.. తన కల ఊహించని విధంగా నిజమైంది. పాత సామాన్ల పెట్టేను సర్దు తుండగా భారీ నిధి దొరికింది. అతనికి 50-60 ఏళ్ల క్రితం తండ్రి కూడబెట్టిన నిధికి దొరికింది. అతని తండ్రి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. చిలీ పౌరుడు ఎక్సిక్విల్ హినోజోసా కథ ఇది. అతన్ని అదృష్టం వరించింది. ఉన్నపళంగా అతను కోటీశ్వరుడుగా మారాడు.  పాత సామాను సరిచేస్తుండగా తన తండ్రికి చెందిన పాత బ్యాంక్ పాస్ బుక్ దొరికింది. ఆ బ్యాంకు ఖాతా గురించి ఎవరికీ తెలియదు. 1960-70లలో ఎక్సిసిల్ తండ్రి ఓ ఇంటిని కొనుగోలు చేయాలనే ఆశతో ఆ బ్యాంకు ఖాతాను తెరిచారు. అందులో దాదాపు 1.40 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడు. 50-60 సంవత్సరాల క్రితం దీని విలువ మరింత ఎక్కువగా ఉండేది.

ఎక్సిసిల్ తండ్రి మరణించి దశాబ్దానికి పైగా గడిచిపోయింది. అప్పటి నుండి ఆ బ్యాంక్ పాస్‌బుక్ పాత పెట్టెలో చెత్తలా అలాగే ఉండిపోయింది. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఇప్పుడు ఆ ఇంట్లోని పాత వస్తువులు, చెత్తా చెదారం తొలగించాలని నిర్ణయించుకున్న ఎక్సిసిల్‌ సామాను అమర్చుతుండగా అతని చేతికి బ్యాంకు పాస్‌బుక్‌ దొరకింది. ఆ పాస్‌బుక్‌ ఉన్న బ్యాంకు కూడా చాలా కాలం క్రితం మూతపడటంతో ఒక్కసారిగా డబ్బు వచ్చిందన్న ఆనందం ఆవిరైంది. ఎక్సైల్‌ కూడా పాస్‌బుక్‌లోని డబ్బుపై ఆశలు వదులుకున్నాడు. కానీ, పాస్‌బుక్‌పై ఒక చోట ‘స్టేట్ గ్యారెంటీడ్’ అని ముద్రించబడింది. దీని ప్రకారం.. నేను ఆ ఖాతాలో ఎంత డబ్బు జమ చేశానో, చిలీ ప్రభుత్వం దానిని తిరిగి ఇస్తుందని హామీ ఇచ్చింది. దాంతో అతడిలో కొత్త ఆశలు చిగురించాయి..ఆ డబ్బుపై దావా వేసాడు. కానీ, చిలీ ప్రభుత్వం డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయం న్యాయపోరాటానికి దారితీసింది.

ఇవి కూడా చదవండి

ఆ డబ్బు తన తండ్రి కష్టపడి సంపాదించాడని, డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఇచ్చిందని వివరించాడు. కాబట్టి బ్యాంకు మూతపడిన తర్వాత కూడా ప్రభుత్వం ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టులో కేసు వేశాడు. ప్రభుత్వం వడ్డీ, ద్రవ్యోల్బణంతో పాటు డబ్బును తిరిగి ఇవ్వాలి. ఈ విధంగా, మొత్తం ఇప్పుడు 1 బిలియన్ అంటే దాదాపు 1.2 మిలియన్ డాలర్లు అవుతుంది. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.10 కోట్లు అవుతుంది. అంటే ఎక్సిసిల్‌కి అకస్మాత్తుగా భారీ నిధి దొరికింది.