అక్కడి బౌద్ధ దేవాలయంలో బయటపడ్డ పురాతన నిధి.. పురావస్తు శాస్త్రవేత్తలకే కళ్లు బైర్లు..

|

Dec 04, 2023 | 2:07 PM

చాలా అరుదైన 2000 సంవత్సరాల నాటి నాణేల నిధి దొరికింది. ఇక్కడ లభించిన నిధిలో చాలా నాణేలు రాగితో తయారు చేయబడినట్టుగా తెలిసింది. ఇవి బౌద్ధ దేవాలయ శిధిలాలలో కనుగొన్నారు. ఈ నిధికి సంబంధించిన నివేదిక ప్రకారం.. ఈ నిధి బరువు గురించి పురావస్తు శాస్త్రవేత్తలు వివరిస్తూ.. బరువు సుమారు 5.5 కిలోల బరువుంటుందని చెప్పారు. ఈ నిధిని చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు బైర్లు కమ్మేసినట్టుగా అయింది.

అక్కడి బౌద్ధ దేవాలయంలో బయటపడ్డ పురాతన నిధి.. పురావస్తు శాస్త్రవేత్తలకే కళ్లు బైర్లు..
Mysterious Treasure
Follow us on

మన చుట్టూ ఉన్న భూమిపై గతంలో మన పూర్వీకులు దాచిపెట్టిన, ఖననం చేసిన అనేక సంపదలు, పురావస్తు కళాఖండాలు దాగివున్నాయనేది వాస్తవం. అందుకు నిదర్శనంగానే తరచుగా తవ్వకాలలో అనేన విలువైన నిధి నిక్షేపాలు బయటపడుతుండటం మనం చూస్తుంటాం… ఈ నిధులు కొన్నిసార్లు భూమిలో తవ్వకాలు జరిపినప్పుడు, మరికొన్ని సందర్భాల్లో సముద్రంలో మునిగిపోయి పరిశోధకుల శోధనలో బయట పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు.. విలువైన బంగారం, వజ్రాలు వంటివి కూడా అనేకం కనిపించాయి. వాటికి సంబంధించిన కథనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా కూడా అలాంటిదే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. కుషానుల కాలం నాటి గొప్ప నిధి పాకిస్థాన్‌లో బయటపడినట్టుగా వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

2000 సంవత్సరాల నాటి నాణేలు..

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్లో చాలా అరుదైన 2000 సంవత్సరాల నాటి నాణేల నిధి దొరికింది. ఇక్కడ లభించిన నిధిలో చాలా నాణేలు రాగితో తయారు చేయబడినట్టుగా తెలిసింది. ఇవి బౌద్ధ దేవాలయ శిధిలాలలో కనుగొన్నారు. ఈ నిధికి సంబంధించిన నివేదిక ప్రకారం.. ఇది ఆగ్నేయ పాకిస్తాన్‌లోని మొహెంజో-దారో విస్తారమైన శిధిలాల మధ్య ఉందని తెలిసింది. ఇది సుమారు 2600 BC నాటిదని సమాచారం.

తవ్వకాల్లో ఈ నాణేలు దొరికాయి..

పురావస్తు శాస్త్రవేత్త, గైడ్ షేక్ జావేద్ అలీ సింధీ ఈ నిధి గురించి చెప్పారు. ఇది మొహెంజొదారో పతనం తర్వాత సుమారు 1600 సంవత్సరాల నాటిది. ఆ తర్వాత శిథిలాల మీద స్థూపం నిర్మించారు. త్రవ్వకాలలో ఈ నాణేలను కనుగొన్న బృందంలో షేక్ జావేద్ కూడా ఒకరు. ఈ దొరికిన నాణేల రంగు పూర్తిగా ఆకుపచ్చగా ఉంటుందని తెలిసింది. ఎందుకంటే రాగి గాలిని తాకిన తర్వాత రంగు మారుతుంది. శతాబ్దాలుగా పాతిపెట్టిన కారణంగా ఈ నాణేలు వృత్తాకార కుప్పగా మారాయి. ఈ నిధి బరువు గురించి పురావస్తు శాస్త్రవేత్తలు వివరిస్తూ.. బరువు సుమారు 5.5 కిలోల బరువుంటుందని చెప్పారు. ఈ నిధిని చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు బైర్లు కమ్మేసినట్టుగా అయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..