
ప్రపంచంలోని కొన్ని తెగలు ఇప్పటికీ చాలా బాధాకరమైన, ప్రమాదకరమైన సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణం వారి తెగను రక్షించుకోవడం ఒక్కటే అంటున్నారు. అలాంటిదే ముర్సి తెగ. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన తెగలలో ముర్సి తెగ కూడా ఒకటి. ఈ తెగ భయంకరమైన సంప్రదాయాలు, ప్రమాదకరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందింది. వీరిలో వ్యక్తి చంపడం పురుషత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ తెగ ఏ వ్యక్తినైనా క్షణంలో చంపగలదు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇథియోపియాలోని కెన్యా సరిహద్దులో నివసించే ముర్సి తెగ ప్రజలు వింత ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ ఆచారం తెలిస్తే ఎవరికైనా ఒళ్లు గగ్గుర్పాటుకు గురవుతుంది. ఈ తెగలోని బాలికలు యుక్తవయసుకు రాగానే వారి కింది పెదవిలో రంధ్రం చేసి, గుండ్రని మట్టి పలక, లేదంటే చెక్కను చొప్పిస్తారు.. ఈ పలక పరిమాణం క్రమంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియ చాలా బాధాకరమైనది. అయినప్పటికీ ఇది వారికి అందం, గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అమ్మాయిలు 15 నుంచి16 ఏళ్ల వయస్సుకు వచ్చేసరికి ఆమె దిగువ పెదవిని కొంత భాగం కత్తిరిస్తారు. అందులో చిన్న చెక్క ముక్క లేదా మట్టితో చేసిన పలకను ఉంచుతారు. ఆ తరువాత కాలక్రమేణా ఆ ప్లేట్ల పరిమాణం పెంచుతూ, పెదవిని నెమ్మదిగా సాగదీస్తారు.
ఈ తెగ స్త్రీలను మొదట బానిసలుగా తీసుకునేవారట. అలా ఒకరికి బానిసలుగా ఉండకుండా తప్పించుకోవడానికి వారు తమను తాము వికారంగా చూపించుకోవడానికి పెదవులను కత్తిరించుకోవడం ప్రారంభించారు. కాలక్రమేణా ఈ ఆచారం ఈ తెగవారికి సాంస్కృతిక గుర్తింపుగా మారింది.
ఇప్పుడు ముర్సి తెగలో అతిపెద్ద ప్లేట్ ధరించిన స్త్రీని అత్యంత అందమైన, ధనవంతురాలిగా భావిస్తారు. ఎందుకంటే..అమ్మాయి పెదవికి ఎంత పెద్ద ప్లేట్ ఉంటే.. ఆమెను చేసుకోబోయే భర్త తన తండ్రికి అన్ని ఎక్కువ పశువుల్ని ఎదురు కట్నంగా ఇవ్వాల్సి ఉంటుందట. అలా, ఈ ఆచారం అమ్మాయిలకు ఆర్థిక బలం, అందానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇకపోతే, ఈ తెగ బయటి వ్యక్తుల పట్ల చాలా దూకుడుగా ఉంటుంది. వారు తమ భూమిని, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..