Viral: బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. చెక్ చేయగా దెబ్బకు ఫ్యూజులు ఔట్!

క్లోన్‌డైక్ బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా కొంతమంది పురావస్తు శాఖ అధికారులకు ఓ వింతైన ఆకారం బయటపడింది.

Viral: బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. చెక్ చేయగా దెబ్బకు ఫ్యూజులు ఔట్!
Unknown Animal

Updated on: Jun 27, 2022 | 1:41 PM

నార్త్-వెస్ట్ కెనడాలో ఉన్న క్లోన్‌డైక్ బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా కొంతమంది పురావస్తు శాఖ అధికారులకు ఓ వింతైన ఆకారం బయటపడింది. దాన్ని బయటికి తీసి పరిశోధనలు జరపగా.. దెబ్బకు వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

వివరాల్లోకి వెళ్తే.. జూన్ 21వ తేదీన కొందరు పురావస్తు శాఖ అధికారులు క్లోన్‌డికే బంగారు గనుల్లో ఉత్తరాన తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో ఒకరి పూర్తిగా గడ్డకట్టుకుపోయిన పిల్ల మమూత్(mamooth) అవశేషం ఒకటి బయటపడింది. అక్కడి ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ట్రాండెక్ హ్వాచ్‌లోని క్లోన్‌డైక్ గోల్డ్ ఫీల్డ్స్‌లో యురేకా క్రీక్‌ అనే ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఇక ఆ సమయంలోనే పరిశోధకులు మమూత్ అవశేషాన్ని కనుగొన్నారు.

ఇంకా నమ్మశక్యం కాని విషయమేంటంటే.. మమూత్ అవశేషంపై చర్మం, వెంట్రుకలు ఎక్కడా కూడా చెక్కు చెదరలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది సుమారు 30 వేల సంవత్సరాల క్రితం.. అంటే ఐస్ ఏజ్ టైంలో గడ్డకట్టినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.