సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు మొదట ఎంచుకునేది రైలు. చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దీనిని మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటుండదు. అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు నీళ్లకోసమో, మరేదైనా అవసరం కోసమో స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు రైలు దిగి మళ్లీ ఎక్కుతుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన పసిబిడ్డతో కలిసి రైల్లో ప్రయాణిస్తోంది. ఏదో స్టేషన్‌లో రైలు ఆగింది. తన బిడ్డకు పాలు తీసుకుందామని మహిళ రైలు దిగింది. పాలు తీసుకొని వెనక్కి తిరిగేలోపు రైలు కదిలిపోయింది. దాంతో ఆ తల్లి పడిన ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది.
మహిళ పరుగెత్తుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే రైలు వేగం పుంజుకుంది. కదులుతున్న రైలు.. తన పిల్లాడిని తలచుకుని నిసహాయ స్థితిలో ఆ తల్లి ఏడుస్తూ ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తోంది. ఇది చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇంతలో అక్కడే ఉన్న రైల్వే గార్డ్ ఆ మహిళను చూసి ఏం జరిగిందని అడిగాడు. విషయం చెప్పగానే అతను స్పందించి రైలును ఆపాడు. వెంటనే ఆ మహిళ అతనికి కృతజ్ఞతలు చెప్పి తన బిడ్డకోసం రైలు వైపు పరుగెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. బిడ్డకోసం తల్లడిల్లిపోయిన మహిళ పరిస్థితికి ఒకింతి భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే ఈ వీడియోను 14 లక్షలమందికి పైగా వీక్షించారు. మహిళ ఆవేదనను అర్ధం చేసుకొని రైలు ఆపిన గార్డ్‌పై ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి