Viral Video: ఆ నలుగురిలో అమ్మ ఎవరు..? బుడ్డోడు గుర్తించాడా..? క్యూట్ వీడియో

ఒకే రంగు చీర ధరించిన కొంతమంది మహిళల ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని.. ఒక రూమ్‌లో కూర్చున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బుడతడు.. వారిలో తన తల్లి ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు.

Viral Video: ఆ నలుగురిలో అమ్మ ఎవరు..? బుడ్డోడు గుర్తించాడా..? క్యూట్ వీడియో
Small Boy Cute Video

Updated on: Mar 11, 2022 | 10:06 AM

Trending Video: నెట్టింట డైలీ చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని వీడియోలు చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. తాజాగా ఓ సూపర్ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుంది.  ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన క్లిప్‌లో.. ఒకే రంగు చీర ధరించిన కొంతమంది మహిళల ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని.. ఒక రూమ్‌లో కూర్చున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బుడతడు.. వారిలో తన తల్లి ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు.  ఈ వీడియోను మార్చి 6న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 18 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 5 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి. సదరు పిల్లాడి క్యూట్ మూవ్స్.. కచ్చితంగా మీ మనసును ఆకట్టుకుంటాయి.  వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్నోడు ఒకే రకమైన పసుపు రంగు చీరలు ధరించిన నలుగురు మహిళలు ఉన్న గదిలోకి రావడం మీరు చూడవచ్చు. వారిలో ఒక మహిళ ఆ బడ్డోడి తల్లి. ఆమె ఎవరో గుర్తించడానికి బాలుడు ప్రయత్నించడం గమనించవచ్చు. ఫేస్ కవర్ చేసిన.. ఆ నలుగురు మహిళలు చిన్నోడిని తమ వద్దకు రమ్మని సైగ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ బుడ్డోడు..  ఒక మహిళ వద్దకు వెళ్లాడు. ఆపై వెంటనే ఆమె తన తల్లి కాదని గ్రహించాడు. కొన్ని సెకన్ల తర్వాత, బుడతడు తన తల్లిని గుర్తించి.. ఆమె ఒడిలోకి ఎక్కి కూర్చున్నాడు. పసిపిల్లవాడు తన తల్లిని గుర్తించగలిగిన విధానాన్ని నెటిజన్లు ఇష్టపడుతున్నారు. వీడియో చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ వీడియోను దిగువన చూడండి:

Samantha: సంచలనంగా మారిన సామ్ రెమ్యూనరేషన్.. సౌత్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్..!

ప్రభాస్ రేంజ్ ఇకపై పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ