Viral Video: ప్రస్తుత కాలంలో మనుషులు(Humans) తీరు రక్షసులను మించిపోతుంది. మనుషుల్లో మానవత్వం(Human Being) నశించి.. శాడిజం(Sadism) పతాక స్థాయికి చేరుకుంటుంది. ఎదుటి వారిపై అసూయ, ధ్వేషాలతో రగిలిపోతూ.. ఇతరుల ప్రాణాలను సైతం బలిగొనేందుకు సిద్ధపడిపోతున్నారు. పరాయి వ్యక్తులను కాదు.. కన్న బిడ్డలను(Baby) సైతం హతమార్చే స్థాయికి దిగజారిపోతున్నారు మనుషులు. అడవిలోని జంతువులైనా తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి కానీ, నేటి కాలపు మనుషులు మాత్రం హీనాతి హీనంగా తయారవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ భయంకరమైన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే పైన చేసిన ప్రతీ వ్యాఖ్య నిజమే అనిపించక మానదు. ఓ తల్లి తన మూడేళ్ల కూతురుని ‘జూ’లోని క్రూర జంతువుల ఎన్‌క్లోజర్‌లోకి నెట్టేసింది. మరి ఆ అమ్మ ఎంత క్రూరమైనదో అర్థం చేసుకోవచ్చు.
వివరాల్లోకెళితే.. ఉజ్బెకిస్తాన్‌లో తాష్కెంట్ జూలో సందర్శకులంతా జంతువులను సంతోషంగా చూస్తున్నారు. ఎలుగుబంటి ఉన్న ఎన్‌క్లోజర్ వద్ద కొందరు పర్యాటకులు ఉన్నారు. అందులో ఓ మహిళ, ఆమె వెంట 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే, ఆ మహిళ చూస్తూ చూస్తే తన పాపను యానిమల్ ఎన్‌క్లోజర్‌లోకి తోసేసింది. ఆ తరువాత తనకేమీ ఎరుగనట్లు అరుపులు, కేకలు పెట్టింది. పాప ఎన్‌క్లోజర్‌లోకి పడిపోగానే ఎలుగుబంటి పాప వద్దుకు వెళ్లింది. అయితే, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది. ఎలుగుబంటిని అక్కడినుంచి వెళ్లగొట్టి పాపను రక్షించారు జూ సిబ్బంది. అయితే, 16 అడుగుల పైనుంచి కింద పడటంతో పాపకు గాయాలయ్యాయి. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, జూ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా.. అసలు విషయం వెలుగు చూసింది. చిన్నారి పొరపాటున పడలేదని, తల్లే కావాలాని చిన్నారిని ఎన్‌క్లోజర్‌లో పడే హత్య చేసే ప్రయత్నం చేసిందని నిర్ధారణ అయ్యింది. కసాయి తల్లిపై కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు.
VIEWER DISCRETION IS ADVISED!
CCTV footage shows a woman throwing her daughter into a bear’s enclosure in Uzbekistan’s Tashkent Zoo.
The toddler was not harmed by the bear, but she was hospitalized with injuries due to the fall.
The woman’s motivation has remained unclear. pic.twitter.com/R5c4aDzSFA
— Press TV (@PressTV) February 1, 2022
Also read:
Signs of Cancer: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మహిళలు వీటిని అస్సలు విస్మరించకూడదు..!
TV9 Digital News Round Up: వచ్చే నెల 11న రాధేశ్యామ్ | శ్రీవల్లి పాటకు బామ్మ డాన్స్..(వీడియో)