Astronauts Falls: అరరరే, చందమామపై జారిపడ్డారు..! మూన్ వాక్ బ్లూపర్స్! వీడియో చూశారంటే పొట్టచెక్కలే

|

Jun 09, 2022 | 5:47 PM

ప్రతిరోజు ఇంటర్‌ నెట్‌లో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి.. మూన్‌వాక్‌ బ్లూపర్స్‌.. వ్యోమగాములు చంద్రునిపై పడిపోయినట్టు కనిపించే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Astronauts Falls: అరరరే, చందమామపై జారిపడ్డారు..! మూన్ వాక్ బ్లూపర్స్!  వీడియో చూశారంటే పొట్టచెక్కలే
Moon Walk Bloopers
Follow us on

ప్రతిరోజు ఇంటర్‌ నెట్‌లో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి.. మూన్‌వాక్‌ బ్లూపర్స్‌.. వ్యోమగాములు చంద్రునిపై పడిపోయినట్టు కనిపించే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వ్యోమగాములు చంద్రుడిపై పడుతూ లేస్తూ..అవస్థలు పడుతున్న దృశ్యాలను నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. నాసా తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…

1969లో చంద్రుడిపై మొదటిసారి మనిషి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 1972లో అపోలో 17 మిషన్‌లో వ్యోమగాములు చివరిసారి చందమామపై తిరిగారు. ఆ సమయంలో భారీగా చంద్రశిలలు, మట్టిని భూమికి తీసుకొచ్చారు. చందమామను చేరిన వ్యోమగాములు..అక్కడ నడిచారు, పరుగెత్తారు, గెంతారు, పట్టరాని సంతోషంతో శూన్యంలో ఎగిరేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు చాలాసార్లు వారు జారిపడ్డారు. కొన్నిసార్లు బ్యాలెన్స్ నిలుపుకోలేక పడిపోయారు. చందమామపై బరువు తక్కువగా ఉండటం సహజం… కాబట్టి.. వారు తరచూ పడిపోయేవాళ్లు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా సోషల్‌ మీడియాలో చేరింది. ఈ వీడియోలో వ్యోమగాములు పడిపోయే దృశ్యాలు చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. జూన్ 7న ఈ వీడియోని షేర్‌ చేయగా, లక్షల మంది వీక్షించారు. వేల మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

చందమామపై వ్యోమగాములు నియంత్రణ కోల్పోవడం, ఆపై జారిపడిపోవటం, ఉల్లాసంగా చంద్రుని ఉపరితలంపై పడటం ఫుటేజీలో కనిపించింది.