Viral Video: అయ్యో పాపం.. తీవ్ర గాయాలతో పిల్ల కోతితో కలిసి చికిత్స కోసం వచ్చిన తల్లి కోతి..

|

Jun 09, 2022 | 5:14 PM

Monkey Visits Clinic: కోతుల గుంపుగా ఉన్న సమయంలో వాటిని ఎదుర్కోవడానికి ఎవరూ సాహసించలేరు. అదే ఒటరిగా కనిపించే కోతులపై కొందరు దాడి చేయడం మనం చాలా సార్లు చూసి ఉంటాం. కొందరు ఇలా కావాలని ఇటుకలు, రాళ్లు కోతులపైకి..

Viral Video: అయ్యో పాపం.. తీవ్ర గాయాలతో పిల్ల కోతితో కలిసి చికిత్స కోసం వచ్చిన తల్లి కోతి..
Monkey Visits Clinic
Follow us on

అడవుల్లో నివసించే కోతులు ఈ మధ్య మానవ నివాసాల చుట్టూ కనిపిస్తున్నాయి. కోతుల గుంపుగా ఉన్న సమయంలో  వాటిని ఎదుర్కోవడానికి ఎవరూ సాహసించలేరు. అదే ఒటరిగా కనిపించే కోతులపై కొందరు దాడి చేయడం మనం చాలా సార్లు చూసి ఉంటాం. కొందరు ఇలా కావాలని ఇటుకలు, రాళ్లు కోతులపైకి విసురుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజా బీహార్‌లోని ససారంలో జరిగింది. గ్రామంలోకి వచ్చిన ఓ తల్లి కోతిపై కొందరు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన కోతి తన బుజ్జి కోతిని తీసుకుని హాస్పత్రికి వచ్చిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చికిత్స నిమిత్తం కోతి క్లినిక్‌కు వచ్చింది

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కోతి ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తన చిన్నారి బుజ్జి కోతిని తీసుకుని వచ్చింది. డాక్టర్ వచ్చే వరకు లోపల బెంచ్ మీద కూర్చొని ఉంది. డాక్టర్ వచ్చిన తర్వాత తనకు తగిలిన గాయాలను చూపించింది. కోతికి జరిగిన గాయానికు వైద్యుడు చికిత్స  అందించారు. విషయం తెలుసుకున్న వైద్యుడు దానికి చికిత్స అందిచారు వైద్యుడు.

కోతికి వైద్యుడు చికిత్స

మొదట కోతిని చూసి భయపడిపోయానని.. కోతి నొప్పితో బాధపడుతుంటం తనకు కనిపించిందని.. దీంతో నెమ్మదిగా దానికి వైద్య పరీక్షలు చేయడం మొదలు పెట్టినట్లుగా డాక్టర్ తెలిపారు. దానికి కొందరు ఇటుకలతో చేసిన గాయాలకు మెడిసిన్ రాసినట్లుగా తెలిపారు. మందు వేసిన తర్వాత కోతి కాసేపు క్లినిక్ లోపలే విశ్రాంతి తీసుకుందని అన్నారు.

 


వైరల్ అవుతున్న వీడియో

తీవ్రంగా గాయపడిన కోతికి చికిత్స పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్తలు రాసే వరకు సోషల్ మీడియాలోని అనేక ప్లాట్‌ఫారమ్‌లలో దీనికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు స్పందిస్తున్నారు. జంతువులను బాధించే వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.