Viral Video: ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..!

|

Jan 22, 2022 | 2:10 PM

Viral Video: భూమిపై సమస్త జీవరాశిని ఏలుతున్న మానవుడు ఒకప్పుడు కోతి జాతికి చెందిన వాడని అనేక అధ్యయనాలు తేల్చాయి.

Viral Video: ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..!
Follow us on

Viral Video: భూమిపై సమస్త జీవరాశిని ఏలుతున్న మానవుడు ఒకప్పుడు కోతి జాతికి చెందిన వాడని అనేక అధ్యయనాలు తేల్చాయి. పరిణామ క్రమంలో కోతి నుంచి మనిషి ఉద్భవించాడని మనందరం చదువుకున్నా కూడా. అందుకే కోతులను మానవుల పూర్వీకులు అని పిలుస్తుంటారు. కోతి చర్యలు కూడా అచ్చం మనిషి చర్యల మాదిరిగానే ఉంటాయి. వాటి చేష్టలు, అల్లరి, ఆలోచనా విధానం, వాటిలోని మానవత్వం, సాయం చేసే గుణం, రౌడీయిజం ఇలా అన్ని లక్షణాలు ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటాయి. ఇక సోషల్ మీడియా ప్రపంచంలో కోతులకు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి కోతి నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో కోతికి ఆహారం పెట్టారు నిర్వాహకులు. అయితే, ఆ ఆహారం దాని చేతికి అందాలంటే ఫజిల్‌ను ఛేదించాల్సి ఉంటుంది. అడవిలో ఓ ప్రత్యేకమైన ఫజిల్‌లా ఉండే చెక్క బోర్డును ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అందులో కొన్ని పండ్లను పెట్టారు. ఆ పండ్లను కోతి తీసుకోవాలంటే కొన్ని అడ్డంకులను తొలగించుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ పండ్లు దానికి చేతికి అందేది.. దాని ఆకలి తీరేది. మరి కోతేం తక్కువనా.. తానేమీ మనుషులకు తీసిపోనంటూ ఊహించని రీతిలో ఆ ఫజిల్‌ను క్లియర్ చేసింది. పండును ఎత్తుకెళ్లింది. అయితే, నిర్వాహకులు కోతి ఫజిల్‌ను ఛేదించడాన్ని వీడియో తీసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో మంకీవిడ్జ్‌లో పోస్ట్ చేయగా.. దానిని నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. లక్షలాది మంది నెటిజన్లు వీడియోను చూడగా.. వేలాది మంది లైక్స్ కొట్టారు. చాలామంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Oppo Reno 7 5G: భారత్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఒప్పో రెనో 7 5జీ స్మార్ట్‌ఫోన్లు..!

IPL 2022: ఐపీఎల్ 2022లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌‌గా మారిన భారత ఓపెనర్.. కోహ్లీ, రోహిత్‌లు వెనుకంజలోనే..

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..