Viral Video: ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం మానవాళి మొదటి ధర్మం. మానవత్వం చెప్పే మొదటి సూత్రం ఇదే. ఎవరికైనా ఆపదలు వచ్చినా, కష్టాల్లో కూరుకుపోయినా సాయం చేయాలని ధర్మం సూచిస్తుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో మనుషుల్లో మానవత్వం అనేది అంతరించిపోతోంది. ఉరుకులు, పరుగుల జీవితంలో ఎవరి జీవితం వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ జంతువుల్లో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్నాయి. మూగ జీవాల్లో మనుషుల్లోని లేని మానవత్వం చిగురిస్తోంది. అసలేమీ తెలియని మూగ జీవులు.. తమ సహచర జీవులకు బాసటగా నిలుస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న తోటి జీవులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. తాజాగా మానవత్వం పరిఢవిల్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విద్యుత్ షాక్‌కు గురై.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కోతికి.. మరో కోతి పునర్జన్మను ప్రసాదిస్తుంది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ కోతి విద్యుదఘాతానికి గురై కింద పడిపోయింది. అది చూసిన సహచర కోతి.. బాధిత కోతిని లేపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కదిలిస్తుంది.. నోటితో ఏదో ప్రయత్నం చేస్తుంది. వెన్నుపై మర్దనా చేస్తుంది. పక్కనే ఉన్న నీటి గుంటలో వేసి పైకి, కిందకు ముంచి తీస్తుంది. అలా సహచర కోతిని రక్షించేందుకు దాని శాయశక్తులా ప్రయత్నిస్తుంది. చివరకు ఆ కోతి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయి.. బాధిత కోతి ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియోను @RebeccaH2030 అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెడుతున్నారు. వైద్యులకే పాఠాలు నేర్పించిన కోతి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ కోతిని చూసైనా మనుషలు సిగ్గు తెచ్చుకోవాలని మరికొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Viral Video:
This monkey saves another monkey who is dying from electrocution.?
The beatings will continue until your health improves. ?#Tiredearth pic.twitter.com/dF6PfoT7BE— Rebecca Herbert (@RebeccaH2030) December 9, 2021
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!