Viral Video: దర్జాగా కూర్చోని కటింగ్ చేయించుకున్న కోతి.. చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

|

Dec 02, 2021 | 6:35 PM

కోతి పనులు చూస్తుంటే నవ్వులు పూయిస్తుంటాయి. కోతులు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంటాయి. ఇక కొన్నిసార్లు

Viral Video: దర్జాగా కూర్చోని కటింగ్ చేయించుకున్న కోతి.. చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్.. వీడియో వైరల్..
Follow us on

కోతి పనులు చూస్తుంటే నవ్వులు పూయిస్తుంటాయి. కోతులు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంటాయి. ఇక కొన్నిసార్లు కోతులు మనుషుల మాదిరిగానే ప్రవర్తింటాయి. ఇటీవల సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని కోతులు అచ్చం మహిళల మాదిరిగానే రెడీ అవ్వడం.. మనషులలాగే పని చేయడం చూసుంటాం. కొన్ని కోతులుగా మహిళల్లాగే డ్రెస్సింగ్ వేసి.. మేకప్ వేసుకున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక గతంలో లాక్ డౌన్ సమయంలో కోతికి షేవింగ్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది. కానీ సెలూన్ షాపుకు వెళ్లి కోతి కటింగ్ చేయించుకోవడం ఎప్పుడైనా చూశారా ?.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఓ కోతి సెలూన్ షాపులో దర్జాగా కూర్చోని కటింగ్ చేయించుకుంటుంది. అంతేకాదు.. ఆ కటింగ్ చేస్తున్న వ్యక్తి ముందు ఎంతో బుద్దిగా కూర్చోని.. అతనికి సహకరిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. బ్యూటీ పార్లర్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆ కోతి ఎంతో అందంగా కనిపిస్తుందని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో కోతికి కాలర్ చూట్టూ ఒక క్లాత్ చుట్టి పెద్ద అద్దం ముందు కూర్చోబెట్టారు. కటింగ్ చేస్తున్న వ్యక్తి.. కోతి వెంట్రకలను దువ్వి ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‏తో ట్రిమ్ చేస్తుంటే.. కోతి ఓపికగా కూర్చుని అతనికి సహకరిస్తుంది. ఆ వీడియోను మీరు చూసేయ్యండి..

Also Read: Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

Samantha: బాలీవుడ్‏లో పాగా వేయనున్న సమంత.. మరో మూడు ప్రాజెక్టులకు సామ్ గ్రీన్ సిగ్నల్ ?..

Akhanda: థియేటర్లలో అఖండ విజృంభణ.. ఓవర్సీస్‏లో బాలయ్య సినిమా మాస్ జాతర..