Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI తో తయారు చేయబడిన ఈ వ్లాగర్ తన వీడియోలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. AI సృష్టించిన వ్లాగర్ బబ్లూ బందర్ వీడియోకు కొన్ని రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను అతను 'హర్ కి పౌరి' హరిద్వార్‌లో రూపొందించాడు. ఈ బబ్లూ బందర్‌ యాస, నడక, ఆ దేశీ శైలి అన్నీ చాలా వాస్తవంగా కనిపిస్తాయి. ఎంతలా అంటే.. ఈ బబ్లూ బందర్‌ వీడియోలు చూసిన ఎవరూ అది యానిమేటెడ్ అంటే నమ్మలేరు.

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!
Ai Vlogger Bablu Bandar

Updated on: Jun 21, 2025 | 3:02 PM

ఇంటర్నెట్‌లో చాలా మంది వ్లాగర్ల వీడియోలను మీరు చూసి ఉంటారు. వారు తమ వ్లాగ్‌ల ద్వారా దేశాన్ని, ప్రపంచాన్ని చూపిస్తారు. సాధారణంగా ఈ పని మనుషులే చేస్తారు. కానీ ఒక కోతి కూడా అదే పని చేయడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి? అవును అలాంటిదే ఒక ప్రత్యేకమైన కోతి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దాని పేరు బబ్లూ బందర్. ఈ ప్రత్యేకమైన కోతి భారతదేశం అంతటా తిరుగుతూ, తాను సందర్శించే ప్రదేశాల గురించి దేశీ హిందీలో ఫన్నీగా చెబుతోంది. ఆ కోతి ప్రతి రీల్‌ని లక్షలాది మంది చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆ కోతి స్టైల్‌కి ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఈ బబ్లూ బందర్ ఎక్కడి..? దాని స్పెషల్‌ ఏంటో ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…

బబ్లూ బందర్ అనే వ్లాగర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను వ్యక్తి కాదు, AI వ్లాగర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI తో తయారు చేయబడిన ఈ వ్లాగర్ తన వీడియోలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. AI సృష్టించిన వ్లాగర్ బబ్లూ బందర్ వీడియోకు కొన్ని రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను అతను ‘హర్ కి పౌరి’ హరిద్వార్‌లో రూపొందించాడు. ఈ బబ్లూ బందర్‌ యాస, నడక, ఆ దేశీ శైలి అన్నీ చాలా వాస్తవంగా కనిపిస్తాయి. ఎంతలా అంటే.. ఈ బబ్లూ బందర్‌ వీడియోలు చూసిన ఎవరూ అది యానిమేటెడ్ అంటే నమ్మలేరు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

మీరు బబ్లూ బందర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను vloggerbabloo_ai చూస్తే..ఇక్కడ ప్రతి వీడియోకు అనేక మిలియన్ల వ్యూస్‌ రావటం చూస్తారు. పైగా బబ్లూ వీడియోలన్నీ ఆధ్యాత్మికతతో కూడి ఉంటాయి. ఒక వీడియోలో అతను హరిద్వార్‌కు వెళుతున్నట్లు, మరొక వీడియోలో అతను కైంచి ధామ్‌కు వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఒక వీడియోలో అతను కేదార్‌నాథ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది. అయితే, మొత్తం క్రెడిట్‌ వెనుక లఖన్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడని తెలిసింది. ఢిల్లీ నివాసి అయిన లఖన్ సింగ్‌ అద్బుతమైన సృష్టి బబ్లూ బందర్‌ AI వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ అతని ట్యాలెంట్‌ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..