Amazing Auto Rickshaw: హైటెక్‌ ఆటో రిక్షా.. ఖరీదైన కారు కంటే ఎక్కువ.. స్టార్‌ హోటల్‌ సదుపాయాలు మించి..

|

Jun 10, 2023 | 11:18 AM

ఎంత అద్భుతమైన, అందమైన ఆటో ఇది.. ఇందులో ఎవరైనా ప్రయాణించారా..? అంటూ అడుగుతున్నారు.. ఈ ట్వీట్‌కి 11 వేలకు పైగా వ్యూస్‌, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు దీనిపై వారి స్పందన తెలియజేశారు. ఇది ఆటో కాదు.. లోపలి నుండి చూస్తే.. ఇది ఒక గొప్ప కారుగా వర్ణించారు. ఈ ఆటో రిక్షాలో ప్రయాణించడం అంటే..

Amazing Auto Rickshaw: హైటెక్‌ ఆటో రిక్షా.. ఖరీదైన కారు కంటే ఎక్కువ.. స్టార్‌ హోటల్‌ సదుపాయాలు మించి..
Amazing Auto Rickshaw
Follow us on

ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అవును, ఇది మామూలు రిక్షా కాదు. ఈ ఆటోను చూస్తుంటే అన్ని ఆటోలు ఇలాగే మారిపోతే, ఎంత బాగుంటుదని అనిపించకమానదు. బెంగళూరులో ఓ ఆటోడ్రైవర్ తన రిక్షాను చూపరులను కళ్లు తిప్పుకోనివ్వకుండా, ప్రయాణికులు తన ఆటో చుట్టే తిరిగేలా మార్చాడు. అవును, ఈ ఆటో బయట నుండి మాత్రమే కాదు.. లోపల కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. రిక్షా లోపల పూర్తి లగ్జరీ సదుపాయాలను కల్పించాడు. ఖరీదైన కారులో ఉన్నట్టుగా కుషన్లు, డిజిటల్ మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు అద్భుతమైన లైట్లు ఏర్పాటు చేశాడు.. ఒక్కసారి వీడియో చూశారంటే.. ఇంతకు ముందు ఇలాంటి రిక్షా మరెక్కడా చూడలేదనే చెబుతారు. బెంగళూరులో మోడిఫైడ్ ఆటో రిక్షాలో ఫ్యాన్లు, ఖరీదైన సీట్లు అమర్చిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోలో అద్భుతమైన ఆటో కనిపిస్తుంది. ఈ ఆటోను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేశాడు సదరు ఆటోవాలా. ఆటోలో ప్రయాణించే వారికి విలాసవంతమైన సదుపాయాలను సమకూర్చాడు. ఈ ఆటో రిక్షాలో ట్రే టేబుల్, కుషన్, లగ్జరీ సీట్లు, ఫ్యాన్, డిజిటల్ డిస్‌ప్లే, మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు అద్భుతమైన LED లైట్లు ఉన్నాయి. అలాగే, ఆటోలో అద్భుతమైన క్రోమ్ వర్క్ కనిపిస్తుంది. ఈ మూడు చక్రాల వాహనం వెనుక రంగురంగుల టిక్కర్ నడుస్తోంది. దాని కింద దివంగత కన్నడ నటులు పునీత్ రాజ్‌కుమార్, శంకర్ నాగ్ పోస్టర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ ఆటో పూర్తిగా గాజు అద్దాలు, తలుపులతో తయారు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ ‘అజిత్ సహాని’ (@ajithkumar1995a) పోస్ట్ చేసారు. వీడియో క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు – హలో బెంగళూరు… ఎంత అద్భుతమైన, అందమైన ఆటో ఇది.. ఇందులో ఎవరైనా ప్రయాణించారా..? అంటూ అడుగుతున్నారు.. ఈ ట్వీట్‌కి 11 వేలకు పైగా వ్యూస్‌, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు దీనిపై వారి స్పందన తెలియజేశారు. ఇది ఆటో కాదు.. లోపలి నుండి చూస్తే.. ఇది ఒక గొప్ప కారుగా వర్ణించారు. ఈ ఆటో రిక్షాలో ప్రయాణించడం అంటే సరదాగా ఉంటుందని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ..