
ప్రస్తుతం కాలంలో మొబైల్‌ఫోన్ లేని వ్యక్తి లేరంటే నమ్మలేం. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి దగ్గరా సెల్‌ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా, ముసలి.. ఇలా తేడా లేకుండా అందరికీ అవసరంగా మారింది సెల్‌ఫోన్. ఎక్కడ ఎప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్, ఏదో ఒక ఫోన్ తప్పక ఉండే ఉంటోంది. అయితే.. దాదాపుగా చాలా మంది ఫ్యాంటు జేబుల్లోనే మొబైల్స్ పెట్టుకుంటుంటారు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? కానీ, అలా ప్యాంట్‌జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్ బాంబ్‌లా పేలింది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…
వీడియో ఇక్కడ చూడండి..
అన్నమయ్య జిల్లాలో సెల్‌ఫోన్ పేలిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మే 22 గురువారం రోజున మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్యాంట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది,
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..