ఫారెస్ట్‌లో చిన్నారి మిస్సింగ్.. కూడా పెట్ డాగ్స్.. విమానాలు, డ్రోన్లతో సెర్చింగ్.. చివరకు

|

Sep 24, 2023 | 3:15 PM

రెండేళ్ల బాలిక కోసం డ్రోన్లు, పోలీసు కుక్కలతో సహా రెస్క్యూ బృందాలు వెతికాయి. రాత్రి కావడంతో పాపను కనిపెట్టడం కష్టతరంగా మారింది. అయితే, ఆ చిన్నారి తప్పిపోయిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ అడవి జంతువుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో రెస్క్యూ టీం రాత్రివేళ అడవిలోకి వెళ్లేందుకు భయపడ్డారు. అయితే, తెల్లవారుజామున డ్రోన్లతో గాలిస్తున్న పోలీసు బృందానికి అక్కడి అడవిలో రెండు రోట్‌వీలర్ కుక్కలు కనిపించాయి.

ఫారెస్ట్‌లో చిన్నారి మిస్సింగ్.. కూడా పెట్ డాగ్స్.. విమానాలు, డ్రోన్లతో సెర్చింగ్.. చివరకు
Child Missing
Follow us on

పెంపుడు కుక్కలతో కలిసి ఆడుకుంటూ కనిపించకుండా పోయిన రెండేళ్ల బాలిక కోసం పోలీసులు ముమ్మరగాలింపు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కనిపెట్టడం కోసం హెలికాఫ్టర్లు, విమానాలు సైతం రంగంలోకి దిగాయి. ఊరువాడ, అడవుల్లో కూడా వెతికారు.. చిన్నారి కోసం గాలిస్తున్న పోలీసులకు ఒక ఊహించని, షాకింగ్‌ సీన్‌ ఎదురైంది. పసిపాప కోసం ఆందోళనగా వెతుకుతున్న పోలీసు బృందాన్ని ఆ దృశ్యం షాక్‌కు గురిచేసింది. అమెరికాలోని మిచిగాన్‌లో జరిగింది ఈ ఘటన. మిచిగాన్‌కు చెందిన రెండేళ్ల బాలిక అదృశ్యమైంది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రెండేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. గల్లంతైన చిన్నారి ఏమీ తెలియని రెండేళ్ల పసిపాప కావడంతో పోలీసులు, ఇతర దళ సభ్యులు, బంధువులు వెతుకులాట ముమ్మరం చేశారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఎలాగైన తమ చిన్నారి కనిపెట్టి తమకు అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. రెండేళ్ల బాలిక కోసం డ్రోన్లు, పోలీసు కుక్కలతో సహా రెస్క్యూ బృందాలు వెతికాయి. రాత్రి కావడంతో పాపను కనిపెట్టడం కష్టతరంగా మారింది. అయితే, ఆ చిన్నారి తప్పిపోయిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ అడవి జంతువుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో రెస్క్యూ టీం రాత్రివేళ అడవిలోకి వెళ్లేందుకు భయపడ్డారు. అయితే, తెల్లవారుజామున డ్రోన్లతో గాలిస్తున్న పోలీసు బృందానికి అక్కడి అడవిలో రెండు రోట్‌వీలర్ కుక్కలు కనిపించాయి. పెంపుడు కుక్కలు చిన్నారిని ఏదో చేశాయని కంగారుపడిన పోలీసు బృందం హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. అక్కడి కనిపించిన సీన్‌ చూసి పోలీసులే నివ్వేరపోయారు.. చిన్న కుక్కను దిండులా పెట్టుకుని ఆ చిన్నారి హాయిగా నిద్రపోతుండటం చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో ఐదేళ్ల రోట్‌వీలర్ ఆ చిన్నారికి కాపలాగా కూర్చుని ఉంది.

ఇవి కూడా చదవండి

పోలీసులను చూసిన ఆ కుక్క చిన్నారికి రక్షణ నిలబడింది. చిన్నారి వద్దకు పోలీసు బృందాన్ని రానివ్వకుండా అడ్డుపడింది. ఎట్టకేలకు బాలిక తల్లిదండ్రులకు ఘటనా స్థలానికి తీసుకొచ్చి వారి పెంపుడు కుక్కను శాంతింపజేశారు. అడవిలో అంతదూరం నడిచి అలిసిపోయినా చిన్నారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులు సైతం రిలాక్స్‌ అయ్యారు. చిన్నారిని, కుక్కలను పరీక్షించి ఇంటికి పంపించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..