
ఇటీవల మెట్రో రైలులో ఓ యువతి ‘హౌ టూ కిల్ మెన్’ అనే పుస్తకాన్ని చదువుతున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫొటోపై నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు దీనిని సరదాగా తీసుకోగా, మరికొందరు ఇలాంటి శీర్షికలు సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో మరో ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈసారి హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే శీర్షికతో ఉన్న పుస్తకాన్ని చదువుతున్నట్లు కనిపించాడు. ఈ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఈ బుక్ టైటిల్ కింద ఆర్జీవీ అని ఉంది. అంటే చాలా మంది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రాసిన బుక్ అని అనుకుంటున్నారు. కానీ అది ఆయన రాసింది కాదు.
ఇది కూడా చదవండి: మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు.. మన దేశంలోని భయంకర ప్రదేశం గురించి తెలుసా?
కాగా, ఈ రెండు ఘటనలను పోల్చుతూ నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘మొదటి పుస్తకానికి ఇదే కౌంటర్’’, ‘‘సోషల్ మీడియా సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు ఇది మరో ఉదాహరణ’’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి పుస్తకాల శీర్షికలు కేవలం వ్యంగ్యంగా లేదా వినోదం కోసం రూపొందించినవై ఉండొచ్చని, వాటిని అక్షరార్థంలో తీసుకోవద్దని సూచిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న పుస్తకం నిజంగానే ప్రచురితమైనదా? లేక వినోదం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కవర్ మాత్రమేనా? అనే విషయంపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అందువల్ల ఈ ఫొటోను నిజమైన పుస్తకంగా నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవు. మొత్తానికి వరుసగా మెట్రోలో వైరల్ అవుతున్న ఇలాంటి పుస్తకాల ఫొటోలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
మెట్రో రైళ్లో వైరల్ బుక్స్.. pic.twitter.com/KoDLrb6RVn
— Sayyad Nag Pasha (@nag_pasha) July 4, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి