
మిజోరాంలోని చాంఫాయి జిల్లాలోని భారతదేశం-మయన్మార్ సరిహద్దులో రూ.173.73 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం రైఫిల్స్ బుధవారం తెలిపింది. ఫిబ్రవరి 9న జోఖావ్తార్‌లోని సరిహద్దు క్రాసింగ్ పాయింట్‌లో అస్సాం రైఫిల్స్, మిజోరాం పోలీసులు సంయుక్త దాడులు చేసి 57.9 కిలోల మెథాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సరుకును తీసుకెళ్తున్న అనుమానిత వ్యక్తులను పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, కారులో ఉన్నవారు అప్రమత్తమై, ఆ కన్సైన్మెంట్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. 173.73 కోట్లు విలువైన ఈ కన్సైన్మెంట్ గురించి తదుపురి దర్యాప్తు, చట్టపరమైన చర్యలపై పోలీసుల ఫోకస్ పెట్టారు.
‘ఐస్’ లేదా ‘క్రిస్టల్ మెత్’ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ అత్యంత సైకోస్టిమ్యులెంట్ డ్రగ్. ఇది కొకైన్ మాదిరిగానే యువతను వ్యసనపరులు చేస్తుంది. మెథాంఫెటమైన్ డ్రగ్ అనేది రిలాక్స్ మూడ్‌లోకి తీసుకెళుతుందని వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ సరుకు ఎక్కడినుండి వచ్చింది అన్న దానిపైన విచారణ కొనసాగుతుందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..