Miss Universe 2024: మిస్‌ యూనివర్స్‌ కిరీటం కోసం పోటీపడ్డ 125 మంది భామలు.. దక్కింది ఈమెకే

|

Nov 17, 2024 | 7:21 PM

అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌కు ఉండే క్రేజే వేరు. ఒక్కసారి కిరీటాన్ని ధరిస్తే చాలు.. వారి అందం ప్రపంచ వేదికపై సాక్ష్యాత్కరించబడుతుంది! అయితే డెనార్క్ యువతి 73వ మిస్ యూనివర్స్ కిరాటాన్ని అందుకోవడమే కాదు.. మరో అరుదైన ఘనత కూడా సాధించిందీ భామ.

Miss Universe 2024: మిస్‌ యూనివర్స్‌ కిరీటం కోసం పోటీపడ్డ 125 మంది భామలు.. దక్కింది ఈమెకే
Victoria Kjaer Theilvig
Follow us on

మెక్సికో వేదికగా మిస్‌ యూనివర్స్‌ పోటీలు అదరహో అనిపించేలా జరిగాయి. డెన్మార్క్‌ యువతి విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌ 73వ మిస్ యూనివర్స్​ కిరీటాన్ని దక్కించుకుంది. 120మందిని వెనక్కినెట్టి 2024 విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచింది 21ఏళ్ల డెన్మార్క్​ యువతి.


ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా నైజీరియా భామ చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికో యువతి ఫెర్నాండా ఎంపికైంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా అరుదైన ఘనత సాధించింది. అయితే ఇక్కడ కేవలం శారీరక సౌందర్యం మాత్రమే ప్రాతిపదిక కాదు.. ఇంకెన్నో కోణాల్లోనూ విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌కు ఈ అర్హత దక్కింది. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొంది వ్యాపారవేత్తగా మారింది. డ్యాన్సులోనూ శిక్షణ తీసుకుంది. మానసిక ఆరోగ్యం, మూగజీవాల సంరక్షణ లాంటి విషయాలపై పోరాటం చేస్తుంది. అందాల పోటీల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్ రంగంలోకి వచ్చింది. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక 2024లో ఏకంగా మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకొని ప్రశంసలు అందుకుంది. విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌కు ఫ్యాషన్‌ ప్రియుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు, ఈ పోటీల్లో భారత్‌ తరఫున రియా సింఘా పాల్గొన్నారు. టాప్‌ 5లోనూ ఆమె నిలవలేకపోయారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి