Viral: గులాబీ రంగులో చెరువు నీరు.. కారణం ఏంటో తెలిస్తే.. పూర్తి వివరాలు

అమెరికాలోని హవాయిలో ఓ చెరువు నీరు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత రెండు వారాలుగా ఈ నీరు ఇలాగే కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని అమెరికాకు చెందిన ‘ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌’ తెలిపింది.

Updated on: Nov 13, 2023 | 12:19 PM

అమెరికాలోని హవాయిలో ఓ చెరువు నీరు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత రెండు వారాలుగా ఈ నీరు ఇలాగే కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని అమెరికాకు చెందిన ‘ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌’ తెలిపింది. అధిక లవణీయత ఉన్న నీటిలో కనిపించే బాక్టీరియా కారణంగా నీళ్లు రంగు మారిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కరవు కారణంగా జూన్‌ నుంచి చెరువులో నీరు ఆవిరి కావడం వల్ల లవణీయత పెరిగిందని చెబుతున్నారు. నీరు విషపూరితం కాలేదని, రంగు మార్పుపై స్పష్టత కోసం నమూనాలు సేకరించి హవాయీ విశ్వవిద్యాలయానికి పంపించామని అధికారులు తెలిపారు.