
ఇజ్రాయెల్‌లో భారీ ఇసుక తుఫాను కలకలం రేపుతోంది. దేశ దక్షిణ భాగాల్లో నెగెవ్ ఎడారి, బీర్షెబా ప్రాంతాలను దూళిమబ్బులు కమ్ముకున్నాయి. ఈ తుఫాను ఇజ్రాయెల్ సైనిక స్థావరాల వరకు చేరుకున్నట్టు సమాచారం. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతుండగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఇసుక తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరిగిందనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
మరోవైపు ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. జెరూసలెం శివారులోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఈ కార్చిచ్చుతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతంలోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వీడియో ఇక్కడ చూడండి..
INSANE sandstorm sweeps southern Israel, West Bank amidst raging wildfire crisis pic.twitter.com/QPDIgw3hft
— RT (@RT_com) May 1, 2025
కార్చిచ్చు కారణంగా జెరూసలెం నుంచి టెల్ అవీవ్ ను కలిపే ప్రధాన రోడ్డు సహా అన్ని రహదారులను అధికారులు మూసివేశారు. ఆ రహదారి వెంట పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ కార్లను వదిలి ప్రాణ భయంతో పరుగులుతీస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి