
ఒక పెద్ద కొండచిలువ ఒక భారీ జంతువును మింగి, ఆపై దానిని వాంతి చేసుకుంటున్న దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. సాధారణంగా కొండచిలువలు తమ ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, అవి తమ మింగిన ఆహారాన్ని తిరిగి వాంతి చేసుకుంటాయి. ఈ వీడియోలో కనిపించిన కొండచిలువ ఒక పెద్ద జంతువును మింగింది. అది ప్రస్తుతం ఆ జంతువును వాంతి చేసుకునే ప్రక్రియలో ఉంది. సాధారణంగా, కొండచిలువలు తమ పరిమాణం కంటే పెద్ద జంతువులను మింగినప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఆహారం విషపూరితంగా ఉన్నప్పుడు.. ఆహారం మింగిన తర్వాత డిస్టర్బ్ చేస్తే.. ఇలా వాంతి చేస్తాయి. ఈ దృశ్యాన్ని ఒక వ్యక్తి జంతువుల మధ్యలోకి వెళ్లి చిత్రీకరించారు, ఇది ఈ అరుదైన ప్రకృతి సంఘటనను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ వీడియో జంతు ప్రపంచం గురించి ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది. అయితే కొండచిలువ మింగిన జంతువు పిల్లి అని కొందరు అంటుంటే కాదు పిట్ బుల్ రకం శునకం అని మరికొందరు అంటున్నారు.
వీడియో దిగువన చూడండి..
అంత పెద్ద జంతువులను కొండచిలువలు ఎలా మింగుతాయి..?
కొండచిలువల కింది దవడ మనషుల మాదిరిగా ఒకే ఎముకగా ఉండదు. రెండు పార్ట్స్‌గా ఉంటుంది. మధ్యలో లిగామెంట్లు ఉంటాయి. అందుకే నోరు అంతలా పొడవుగా తెరుస్తుంది. కొండచిలువలు ఒక్కసారిగా మింగవు. ఎడమ దవడ నుంచి కుడి దవడకు.. మళ్లీ కుడి నుంచి ఎడమకు.. ఇలా చిన్న చిన్న కదలికలతో శరీరాన్ని లోపలికి లాగుకుంటాయి . మింగేటప్పుడు నోరు పూర్తిగా మూసుకుపోతే శ్వాస ఎలా? అనే డౌట్ మీకు రావొచ్చు. కొండచిలువలకి గ్లాటిస్ ముందుకు బయటకు వచ్చి ఉంటుంది. ఆహారం మింగుతూనే శ్వాస తీసుకుంటాయి. తమ తల కంటే 3–4 రెట్లు పెద్ద జంతువుని కూడా మింగగలవు. మింగిన తర్వాత శరీరం బెలూన్‌లా ఉబ్బుతుంది. పెద్ద ఆహారం మింగిన తర్వాత వాటి లోపల జీర్ణ ఎంజైమ్‌లు భారీగా రిలీజ్ అవుతాయి.ఎముకలు కూడా కరిగిపోయేంత శక్తివంతమైన ఆమ్లాలు వాటిలో ఉంటాయి. అందుకే ఒక పెద్ద జంతువును మింగిన తర్వాత వారం లేదా నెలలు తినకుండానే ఉంటాయి. కొండచిలువలు వేటాడే జంతువులు కాదు,వేట అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా ఉపయోగించుకునే జీవులు. అడవిలో ఆహారం ఎప్పుడూ దొరకదు కాబట్టి, దొరికినదాన్ని పూర్తిగా అమాంతం మింగేస్తాయి.