వార్నీ.. ఇదేమరీ వెర్రీ అంటే..స్టంట్‌ కోసం పెదవులపై గమ్‌ వేసుకున్నాడు.. కట్ చేస్తే సీన్‌ సితారైంది..!

యువకుడి ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలిస్తే అతనికి ఇలాంటి పనులు చేసే అలవాటు ఉందని తేలింది. ఫ్రెండ్స్‌ని, తెలియని వారిని కూడా చిలిపిగా ఆటపట్టించే అలవాటు కూడా అతనికి ఉందని తేలింది. ఈ అలవాటుతోనే అతడు తన పెదవులు అంటించుకోవాలని ట్రై చేసి చిక్కుల్లో పడ్డాడు.

వార్నీ.. ఇదేమరీ వెర్రీ అంటే..స్టంట్‌ కోసం పెదవులపై గమ్‌ వేసుకున్నాడు.. కట్ చేస్తే సీన్‌ సితారైంది..!
Man Sealing His Lips

Updated on: Jan 25, 2025 | 12:11 PM

ప్రతిరోజూ అనేక అద్భుతమైన, విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. కొందరు పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటారు. మరికొందరు సాహసాలు చేస్తుంటారు. ఇంకొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. అయితే, కొందరు తమ వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్‌గా మార్చేసుకోవాలని, త్వరగా ఫేమస్‌ అయిపోవాలని అసాధ్యమైన పనులు చేస్తుంటారు. అలాంటిదే ఓ వింత పని చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోల, ఒక యువకుడు తన పెదవులపై గమ్‌తో ఆడుకుంటున్నాడు. మొదట్లో సరదాగా పెదవులపై గమ్ పెట్టుకుని అతుక్కుపోయేలా ట్రై చేశాడు..ఆ తరువాత నోరు తెరవడానికి ప్రయత్నించాడు.. కానీ, నోరు తెరవలేకపోయాడు. అతని పెదవులు రెండు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. ఎంత ట్రై చేసిన ఫలితం లేకపోయింది. అతుక్కుపోయిన పెదవులతో నోరు తెరవలేక అతడు బిక్కముఖంతో ఏడవసాగాడు. ఇదంతా చూసిన అతని స్నేహితులు కూడా నవ్వుకున్నారు. ఇదంతా వీడియోలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

యువకుడి ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలిస్తే అతనికి ఇలాంటి పనులు చేసే అలవాటు ఉందని తేలింది. ఫ్రెండ్స్‌ని, తెలియని వారిని కూడా చిలిపిగా ఆటపట్టించే అలవాటు కూడా అతనికి ఉందని తేలింది. ఈ అలవాటుతోనే అతడు తన పెదవులు అంటించుకోవాలని ట్రై చేసి చిక్కుల్లో పడ్డాడు. అయితే, చివరకు తన పెదవులు ఓపెన్‌ అయ్యాయా లేదా అనే దాని గురించి ఎలాంటి సమాచారం పోస్ట్ చేయలేదు. కానీ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో, చాలా మంది దీనిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలాంటి విపరీతమైన పనులు చేస్తూ, విచిత్రమైన వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవచ్చు అనుకునేవారికి ఇదొక మంచి గుణపాఠం అంటున్నారు చాలా మంది. ప్రమాదకరమని తెలిసినా ఇలాంటి పనులు చేయడం మూర్ఖత్వం అని మరొకరు పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..