Watch viral video: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత భగవంతుడు కొంతమందికి.. కొన్ని కళలు ఇస్తాడని అవి ఎవరికీ సాధ్యం కాదంటూ కొనియాడుతారు. కళ ఎవరి సొంతం కాదని.. ధనవంతుడైనా.. పేదవాడైనా ఏదో ఒక అద్భుతం అనేది దాగుంటుందని పేర్కొంటుంటారు. అందుకే అలాంటి వారు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే.. ఇటీవల కాలంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు చేస్తున్న డ్యాన్స్.. అదే మూన్ వాక్ చూసి నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదంటూ.. ఆ యువకుడికి కితాబిస్తున్నారు. ఓ యువకుడు మూన్ వాక్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోను దాదాపు 8 మిలియన్ల మంది వీక్షించారు.
ఈ వీడియోను డేవిడ్ హెర్మాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ వీడియోలో ఓ యువకుడు మూన్‌వాక్ ఎలా చేస్తున్నాడో చూడవచ్చు. ఓ రహదారి జంక్షన్ వద్ద రెడ్ లైట్ పడగానే.. యువకుడు కారులోంచి దిగి మూన్‌వాక్ చేస్తాడు. దీంతోపాటు అద్భుతంగా బ్రేక్ డ్యాన్స్ కూడా చేస్తాడు. ఈ వీడియోను టిక్‌టాక్‌లో కామిల్ స్జెపెజెన్కో పంచుకున్నాడు. ఇదీ చూసినవాళ్లంతా షేర్ చేయడంతోపాటు.. తెగ కామెంట్లు చేస్తూ అభినందిస్తున్నారు.
I’ve watched the video 100 times now and I’m still in awe. Further, how the woman just walks by like this is normal. pic.twitter.com/UXgwxKtGok
— David Herrmann (@herrmanndigital) March 27, 2021
Also Read: