Watch: పానీపూరీని ఇంకెన్ని రకాలుగా పాడుచేస్తార్రా బాబు..! ఈ సారి మామిడి రసంతో.. అవాక్కవుతున్న నెటిజన్లు

|

Apr 26, 2023 | 3:34 PM

ప్రస్తుతం ఈ విషయం మీద ఇంటర్నెట్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఆహారంతో తయారుచేసే వెరైటీ కాంబినేషన్స్, ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ పాపులారీలపైనే చేస్తారా అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.

Watch: పానీపూరీని ఇంకెన్ని రకాలుగా పాడుచేస్తార్రా బాబు..!  ఈ సారి మామిడి రసంతో.. అవాక్కవుతున్న నెటిజన్లు
Mango Pani Puri
Follow us on

వేసవి వచ్చేసింది. మండే ఎండలతో పాటు కమ్మటి మామిడి పండ్లు ప్రజల్ని నోరూరిస్తుంటాయి. సీజనల్‌గా వచ్చే మామిడి పండ్లను ప్రజలు పలు రకాలుగా ఆస్వాదిస్తుంటారు. కచ్చి మామిడి కాయలు తింటారు. పండ్లు, రసాలు బాగా ఇష్టపడుతుంటారు. మ్యాంగో జ్యూస్‌తో పాటుగా మామిడి ఐస్ క్రీం కూడా తయారు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మామిడి ప్రియులు వాటిని ఎన్ని రకాలుగా తినొచ్చు అన్ని వెరైటీలు లాగించేస్తుంటారు. కానీ, మామిడి పండ్లతో ఇలాంటి విచిత్ర వంటకం గతంలో ఎప్పుడూ చూసుండరు. మామిడికాయాలు, పండ్లతో ఎన్నో రకాల వంటకాలు చూశాం గానీ, ఇలాంటి కొత్త వంటకాన్ని చూడటం ఇదే తొలిసారి అనుకుంటా బహుశ. పండ్లలో రారాజు అయిన మామిడి పండుతో తయారు చేసిన ఈ కొత్త వంటకం పానీపూరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వంటకం చూసిన ఆహార ప్రియులు తీవ్రంగా స్పందించారు.

మన దేశంలో పానీపూరీ బాగా ఫేమస్‌గా చెప్పుకునే ఒక స్ట్రీట్ ఫుడ్ ఐటమ్‌. పానీపూరీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, పానీ పూరీని వెరైటీగా అందించాలనే తాపత్రయంతో ఈ సారి మరో కొత్త ప్రయోగం వెలుగులోకి వచ్చింది. పానీపూరీలో పానీకి బదులు మామిడి రసాన్ని వాడుతున్నారు. అవును, ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కాబట్టి అందుకు అనుగుణంగా, మామిడిరసాన్ని పానీపూరీలో అందిస్తున్నారు. ఈ వెరైటీ కాంబేషన్ కు మిశ్రమ స్పందన వస్తోంది.
మామిడి రసంతో తయారు చేసిన పానీపూరీ చూసిన కొందరు నెటిజన్లు బాగుందని అంటే, మరికొందరేమో అస్సలు బాలేదని, చెత్తగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద ఇంటర్నెట్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఆహారంతో తయారుచేసే వెరైటీ కాంబినేషన్స్, ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ పాపులారీలపైనే చేస్తారా అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మ్యాంగో పానీపూరీ వీడియోను @bombayfoodie_tales అనే వినియోగదారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 9 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..