పెళ్లయిన, పెళ్లి చేసుకోబోతున్న లేదా పెళ్లి పేరుతో భయపడే వారు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. కొంతమందికి వివాహం అనేది ఒక అందమైన కల. అయితే కొంతమంది మాత్రం వివాహాన్ని వ్యర్థంగా భావిస్తారు. కొందరు మాత్రం ఆర్థిక కష్టాల కారణంగా పెళ్లంటే భయపడిపోతుంటారు. ద్రవ్యోల్బణం అందరినీ చాలా విషయాల్లో భయపడేలా చేస్తుంది. ముఖ్యంగా భార్య అభిరుచులను నెరవేర్చడం కష్టంగా భావించే వారు పెళ్లంటే భయపడిపోతుంటారు. కొంతమందిలో వారి భార్య ఖర్చులు భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరు మంది భార్యలను చేసుకున్నాడు..బాబోయ్ అతని పరిస్థితి ఏంటని భయపడిపోతున్నారు కదా..? కానీ, అదంతా ఏం లేదు..అతని వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంది.. అతడు వారిని రాణుల వలె చూసుకుంటున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
సమాచారం ప్రకారం.. 6 ఆరుగురు భార్యలున్న ఆ వ్యక్తి పేరు ఆర్థర్ ఓ ఉర్సో. అతను బ్రెజిల్ నివాసి. వృత్తిరీత్యా మోడల్. ఆర్థర్ ఓర్సో ఏకకాలంలో 9 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. దాంతో అతడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. అతని భార్యలు 9 మందిలో ముగ్గురు అతనికి విడాకులు ఇవ్వడంతో ఆర్థర్ ఓర్సో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్థర్ ఓ’ఉర్సో ప్రస్తుతం 6 మంది భార్యలతో నివసిస్తున్నాడు. ఆర్థర్ ఓ ఉర్సో తన భార్యలకు ఎలాంటి కొరత రాకుండా చూసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. అతని ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్న తర్వాత, ఆర్థర్ తన మిగిలిన భార్యలు తనను విడిచిపెడతారనే భయం పెంచుకున్నాడు. దాంతో వారికి ఎలాంటి లేటుపాట్లు లేకుండా మహారాణుల మాదిరిగా చూసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు.
ఒక నివేదిక ప్రకారం, ఆర్థర్ ఓ ఉర్సో బ్రెజిల్‌లో తన ఆరుగురు భార్యలతో కలిసి ఉండటానికి ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించాడు. అతను ఈ ఇంటికి (‘Mansao do Amor Livre’) మాన్సావో దో అమోర్ లివ్రే’ అని పేరు పెట్టాడు. ఈ ఇంట్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద గది ఆర్థర్. ఆర్థర్ తన గదిలో ఒక పెద్ద విలాసవంతమైన మంచాన్ని తయారు చేశాడు. ఈ మంచం పరిమాణం 6 మీటర్ల పొడవు, వెడల్పు ఉంటుంది. అంతేకాదు..ఈ మంచం ప్రత్యేకత ఏంటంటే.. ఇది పూర్తిగా బంగారంతో తయారుచేయించాడు. ఇది కాకుండా, ఈ ఇంటిలో గేమింగ్ రూమ్, మినీ గోల్ఫ్ కోర్స్, జిమ్‌తో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. తన ఆరుగురు భార్యలు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు అతడు సకాల సదుపాయాలను సమకూర్చాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..