Viral: ఇంత బ్యాడ్‌లక్ ఏంట్రా.. లచ్చిందేవి ఇంట్లోకి అడుగుపెట్టి మరీ.. వెళ్లిపోయిందిగా..

|

Feb 21, 2024 | 2:02 PM

అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలీదు. ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు రాత్రికి రాత్రి లక్షాధికారులను, కోటీశ్వరులను చేసేస్తుంది. అదృష్టం లేకపోతే గడపదాకా వచ్చిన లక్ష్మి దేవి అటునుంచే వెనక్కి వెళ్లిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది.

Viral: ఇంత బ్యాడ్‌లక్ ఏంట్రా.. లచ్చిందేవి ఇంట్లోకి అడుగుపెట్టి మరీ.. వెళ్లిపోయిందిగా..
Viral
Follow us on

అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలీదు. ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు రాత్రికి రాత్రి లక్షాధికారులను, కోటీశ్వరులను చేసేస్తుంది. అదృష్టం లేకపోతే గడపదాకా వచ్చిన లక్ష్మి దేవి అటునుంచే వెనక్కి వెళ్లిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. అమెరికాలోని ఓ వ్యక్తి విషయంలో. అతను లాటరీలో వేల కోట్లు గెలుచుకున్నాడు. కానీ ఆ సొమ్ము అతనికి దక్కలేదు. సదరు లాటరీ కంపెనీవాళ్లు పొరపాటున అతని నెంబరు పబ్లిష్‌ చేసామంటూ సొమ్మును ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఆ వ్యక్తి కోర్టుకెక్కాడు.

అమెరికాలోని వాషింగ్టన్ డీసికి చెందిన జాన్స్ చీక్స్ అనే వ్యక్తి ఇటీవ‌ల ఓ లాట‌రీ గెలిచాడు. ప‌వ‌ర్‌బాల్, డీసీ లాట‌రీ కంపెనీలో అత‌ను 340 మిలియ‌న్ల డాల‌ర్ల లాట‌రీలో విజేత‌గా నిలిచాడు. ఆ లాట‌రీ అమౌంట్ 2800 కోట్లు. జ‌న‌వ‌రి 6, 2023న జాన్ చీక్స్ ఆ లాట‌రీ టికెట్ కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ లాట‌రీ విజేత న్యాయ పోరాటానికి దిగాడు. టికెట్ డ్రా తీసిన రోజు.. డీసీ లాట‌రీ వెబ్‌సైట్‌లో జాన్ చీక్స్ లాట‌రీ నెంబ‌ర్ క‌నిపించింది. కానీ లాట‌రీ కంపెనీ మాత్రం ఆ వార్తను ఖండించింది. నెంబ‌ర్ పొర‌పాటును ప‌బ్లిష్ చేసిన‌ట్లు డీసీ లాట‌రీ కంపెనీ తెలిపింది. దీంతో అత‌ను లీగ‌ల్ పోరాటానికి సిద్దమ‌య్యాడు. త‌న‌కు న‌ష్టప‌రిహారం ఇవ్వాల‌ని ఆ వ్యక్తి లాట‌రీ కంపెనీపై కేసు వేశాడు.(Source)