TikTok User: అతను సెలబ్రెటీ కాదు..కానీ తాగే నీరు కోసం నెలకు లక్షల్లో ఖర్చు.. నెట్టింట వైరల్..

|

Feb 19, 2022 | 8:04 PM

TikTok User: మనిషి కనీస అవసరాల్లో తాగే నీరు కూడా ఉంది. అయితే కొంతమంది ఈ నీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటే.. మరికొందరు ఈ నీరుని ఖరీదు పెట్టి కొనుక్కుని తాగేవారు ఇంకొందరు.. నిజానికి ప్రపంచంలో..

TikTok User: అతను సెలబ్రెటీ కాదు..కానీ తాగే నీరు కోసం నెలకు లక్షల్లో ఖర్చు.. నెట్టింట వైరల్..
Tiktok User
Follow us on

TikTok User: మనిషి కనీస అవసరాల్లో తాగే నీరు కూడా ఉంది. అయితే కొంతమంది ఈ నీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటే.. మరికొందరు ఈ నీరుని ఖరీదు పెట్టి కొనుక్కుని తాగేవారు ఇంకొందరు.. నిజానికి ప్రపంచంలో కొంతమంది  అలవాట్లు వింతగాను, విచిత్రంగాను ఉంటాయి. వ్యక్తులు సాధారణమైన వాళ్లే అయినా వారి అలవాట్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇదిగో ఈ వ్యక్తి కూడా అంతే… ఇతను కేవలం మంచినీళ్ల కోసమే నెలకు లక్షన్నర ఖర్చు చేస్తాడట. పోనీ ఇతనేమైనా పెద్ద సెలబ్రిటీనా అంటే కాదు… టిక్‌టాక్‌లో అప్పుడప్పుడూ వీడియోలు చేస్తూ ఏదో కొంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఎవ‌రైనా కేవ‌లం మంచినీళ్ల కోస‌మే అంత ఖ‌ర్చు పెడ‌తారా అని అనిపిస్తుంది… కానీ ఈమ‌ధ్య మంచి నీళ్ల కోస‌మే కొంద‌రు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నారు. ఇతను ఏ దేశానికి చెందినవాడో తెలియదు కానీ…పేరు మాత్రం రియాన్ డ‌బ్స్.

కేవలం మంచినీళ్లకే అంత ఖర్చుపెట్టడానికి ఓక కారణం ఉంది. అత‌డికి ట్యాప్ వాట‌ర్ అంటే అస్స‌లు ప‌డ‌దట. బ‌య‌ట ఎక్క‌డికి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా.. వేరే ప్ర‌దేశంలో ఉన్నా.. అత‌డు ఈ కాస్ట్‌లీ వాటరే తాగుతాడు. నెల‌కు త‌న మంచినీళ్ల కోసం 2000 డాల‌ర్లు ఖ‌ర్చు పెడ‌తాడు. అంటే మ‌న క‌రెన్సీలో సుమారు లక్ష 50 వేల రూపాయ‌లు అన్న‌మాట‌. నెల‌కు స‌రిప‌డా వాట‌ర్ బాటిల్స్‌ను ఒకేసారి కొనుక్కొని ఇంట్లో నాలుగు ఫ్రిడ్జ్‌ల‌ను ఏర్పాటు చేసుకొని.. అందులో దాచిపెడ‌తాడ‌ట. త‌న‌కు మంచి నీళ్ల మీద ఎంత శ్ర‌ద్ధ ఉంటుందో.. ప‌ర్యావ‌ర‌ణం మీద కూడా అతనిక అంతే శ్ర‌ద్ధ ఉంటుంద‌ట‌. అందుకే.. ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా.. ప‌ర్యావ‌ర‌ణ హిత గ్లాస్ బాటిల్స్‌నే మంచినీళ్లు తాగ‌డానికి వాడుతాడ‌ట‌. ఇక.. త‌ను తాగే వాట‌ర్.. హైఎండ్ వాట‌ర్. చాలా ర‌కాలుగా నీటిని ప్యూరిఫై చేసిన త‌ర్వాత వాటిని అమ్ముతుంటారట. ఒక బాటిల్‌ ధ‌ర వేల‌ల్లో ఉంటుందట. నార్వే నుంచి వోస్ అనే కంపెనీ త‌యారు చేసిన వాట‌ర్‌ను ఇంపోర్ట్ చేసుకుంటాడట. ఈ విష‌యాల‌ను రియాన్ స్వ‌యంగా టిక్‌టాక్ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా మంచినీళ్ల‌కే ఇంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టేవాళ్ల‌ను ఎక్క‌డా చూడ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read: వసంతానికి ముందు మార్చిలో అద్భుతమైన పర్యటన ప్రాంతాలు..