ఆస్తి కోసం తల్లిదండ్రులు, బంధువులు అన్న విషయాన్నే మరిచిపోయి మానవత్వం లేకుండా కొందరు చేస్తున్న తీరు కలచివేస్తోంది. కొందరు డబ్బు కోసం ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రాణాలు పోయిన తర్వాత కూడా వారి ఆస్తి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఓ వృద్ధురాలి వేలిముద్ర తీసుకుంటున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కమలా దేవీ.. మే 8, 2021లో చనిపోయింది. గతంలోనే భర్త మరణించడంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఆ దంపతులకు పిల్లలు లేరు. అయితే, అంత్యక్రియల కోసం భర్త తరఫు బంధువులు ఆమె మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కారు కొద్ది దూరం వెళ్లగానే పక్కకు ఆపారు. ఓ న్యాయవాదిని పిలిపించి ఆమె నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత వాటితో తప్పుడు వీలునామా సృష్టించి ఆమె ఆస్తులు, దుకాణాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేటీజన్లు ఆమె నుంచి సంతకం తీసుకున్న వ్యక్తిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇది 2021లో జరిగిన సంఘటన అని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన ఓ బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా కమలాదేవీ సంతకం పెడుతుందని.. వేలిముద్ర వేయదని తెలిపాడు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆగ్రా పోలీసులు పేర్కొన్నారు.
नीचता की पराकाष्ठा देखिये
वीडियो आगरा के सेवला जाट का बताया जा रहा है
जिसमें एक मृतक वृद्धा से उनकी सम्पतियाँ लेने के लिए उनके शव से अंगूठा लगवाया जा रहा है
इन अमानवीय लोगों का सामाजिक बहिष्कार होना चाहिए@myogiadityanathजी@Uppolice @dgpup@agrapolice @adgzoneagra संज्ञान लीजिये pic.twitter.com/r87ZXWSAwC— Roli Tiwari Mishra सनातनी डॉ रोली तिवारी मिश्रा (@RoliTiwariMish1) April 10, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..