Viral Video: ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

|

Aug 07, 2021 | 4:25 PM

ఎరక్కపోయి వెళ్లాడు.. ఇరుక్కుపోయాడు. ఇప్పుడు మీరు చూడబోయే ఏటీఎమ్ దొంగ అలాంటోడే. మెషీన్‌కు కన్నం వేసిన బీహారీ.. అందులోంచి బయట రాలేక గిలగిల గింజుకున్నాడు...

Viral Video: ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు
Atm Thief
Follow us on

ఎరక్కపోయి వెళ్లాడు.. ఇరుక్కుపోయాడు. ఇప్పుడు మీరు చూడబోయే ఏటీఎమ్ దొంగ అలాంటోడే. మెషీన్‌కు కన్నం వేసిన బీహారీ.. అందులోంచి బయట రాలేక గిలగిల గింజుకున్నాడు. అదే టైమ్‌లో పోలీసులు అటుగా రావడంతో అడ్డంగా దొరికిపోయాడు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా అవన్యాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏటీఎమ్ దోపిడీకి వెళ్లిన దొంగ.. ఏకంగా దానికి కన్నం వేయగలిగాడు. ఆ టైమ్‌లో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని పసిగట్టిన దొంగ.. కన్నంలోంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. కానీ.. అతని వల్ల కాలేదు. ఇలా.. పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఏటీఎమ్ దొంగ బీహార్‌కు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అతని గత చరిత్రపై ఆరా తీస్తున్నారు.  ఏటీఎం వద్ద రెక్కీ నిర్వహించగా సెక్యూరిటీ గార్డు లేకపోవడం చూసిన ఈ బీహారీ చోరీకి పథకం వేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినీ ఫక్కీలో సెల్‌ఫోన్లు చోరీ

తమిళనాడు రాష్ట్రం కాంచీపురంజిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తున్న మొబైల్స్‌ కంటైనర్‌ను సినీ ఫక్కీలో హైజాక్‌ చేసింది దోపిడీ ముఠా. కంటైనర్‌ డ్రైవర్‌పై దాడిచేసి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లింది. ఖాళీ కంటైనర్‌ను డ్రైవర్‌కి అప్పగించి అక్కడి నుంచి పరారయ్యారు. కర్నాటకలోని కోలార్‌ జిల్లా దేవరాయ సముద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

ఎమ్‌ఐ మొబైల్సే టార్గెట్‌గా ఈ దోపిడీ గ్యాంగ్‌ చోరీలకు పాల్పడుతోంది. కాంచీపురంజిల్లా నుంచి పలు రాష్ట్రాలకు వెళ్తున్న కంటైనర్లపై కొన్ని రోజులుగా నిఘా పెట్టిన గ్యాంగ్‌..దోపిడీలకు తెగబడుతోంది. తాజా ఘటనపై సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు బెంగళూరు పోలీసులు. ఇది కంజర్‌భట్‌ ముఠా పనేనని అనుమానిస్తున్నారు. దోపిడీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ టీమ్స్‌ను ఏర్పాటుచేశారు. కంటైనర్ చోరీపై చిత్తూరు పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు కోలార్ పోలీసులు.

Also Read: పంట దాచుకున్న రైతులకు సిరులు కురిస్తున్న “తెల్లబంగారం”.. రికార్డు బ్రేక్

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. మారణాయుధాల కోసం అక్కడ గాలింపు