Viral Video: అందుకే బాసు బోర్డ్ చూడాలి.. నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేస్తే ఇలాగే అవుతుంది.. నవ్వులు పూయిస్తున్న వీడియో

|

Aug 18, 2022 | 12:22 PM

ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ బండిని సీజ్ చేస్తుంటారు. సదరు వాహనాలను తమతోపాటు స్టేషన్‏కు తీసుకెళ్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన స్కూటీ మీద ఉన్న అమితమైన

Viral Video: అందుకే బాసు బోర్డ్ చూడాలి.. నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేస్తే ఇలాగే అవుతుంది.. నవ్వులు పూయిస్తున్న వీడియో
Viral Video
Follow us on

సాధారణంగా రోడ్డు పక్కన కొన్ని ప్రదేశాలలో నో పార్కింగ్ బోర్డ్స్ చూస్తుంటాము. అంటే ఆ ప్రాంతంలో బైక్స్, కార్లు నిలపకూడదు అని. ప్రాంతీయ భాషలలో పెద్ద పెద్ద అక్షరాలతో నో పార్కింగ్ అని రాసి ఉన్న బోర్డ్స్ కనిపిస్తున్నా..అదేం పట్టనట్లుగా చాలా మంది అక్కడే తమ వాహనాలను నిలుపుతుంటారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ప్రదేశమైతే వారే చర్యలు తీసుకుంటారు. అదే పబ్లిక్ ఏరియాలో వారికి ఇబ్బంది అయ్యే విధంగా వాహనాలు పార్క్ చేస్తే ఏం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ బండిని సీజ్ చేస్తుంటారు. సదరు వాహనాలను తమతోపాటు స్టేషన్‏కు తీసుకెళ్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన స్కూటీ మీద ఉన్న అమితమైన ప్రేమతో దాని వెంటే పోలీసులతో వెళ్లిపోయాడు. స్కూటీతోపాటు గాల్లోకి తేలాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మహారాష్ట్రలోని నాగ్‏పూర్‏లోని సదర్ బజార్‏లోని నో పార్కింగ్ ప్రదేశంలో ఓ వ్యక్తి తన స్కూటీని నిలిపాడు. అయితే అటుగా వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని సీజ్ చేసి క్రేన్ సహాయంతో స్టేషన్‏కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ స్కూటీ యజమాని వచ్చి తన బండిపై కూర్చున్నాడు. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు స్కూటీతోపాటు ఆ వ్యక్తిని కూడా గాల్లోకి లేపారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీరు ఈ ఫన్నీ వీడియోను చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.