Viral Video: అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు!

సింగిల్ కింగ్స్ పడే పాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్టలు ఉతకడం దగ్గర నుంచి.. వంట చేసేవరకు.. సింగిల్స్ కష్టాలు వర్ణనాతీతం..

Viral Video: అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు!
Chapati Slided Video

Updated on: Sep 23, 2022 | 12:06 PM

ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినియోగం ఎక్కువైపోయింది. తమను తాము ఫేమస్ చేసుకునేందుకు సామాన్యులు విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. కొంతమంది పాటలు పాడుతుంటే.. మరికొందరు డ్యాన్స్‌లతో అలరిస్తుంటారు. ఇంకొందరు తమదైన కామెడీ టైమింగ్ చూపిస్తే.. మిగిలినవారు విచిత్రమైన వంటకాలు ప్రయత్నిస్తూ ఫేమస్ అవుతుంటారు. అయితే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినవారు మాత్రమే కాదు.. గల్లంతై.. గతి తప్పినవారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మరి లేట్ ఎందుకు ఇంతకీ ఆ వీడియో ఏంటో తెలుసుకుందాం..

సింగిల్ కింగ్స్ పడే పాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్టలు ఉతకడం దగ్గర నుంచి.. వంట చేసేవరకు.. సింగిల్స్ కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఓ యువకుడు వంట చేసేందుకు ప్రయత్నించాడు. ఇక అది కాస్తా బెడిసికొట్టింది. సదరు యువకుడు తన రూమ్‌లో చిన్న గ్యాస్ స్టవ్‌పై చపాతీ కాలుస్తున్నాడు. ఇంతలో మనోడికి ఏం తట్టిందో తెలియదు గానీ.. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసి.. మళ్లీ పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే ట్రై చేశాడు. అయితే ఈలోపే పెననికి ఉన్న కర్ర ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. సో.. ఇలా.. సీన్ కాస్తా మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, వీడియోనేషన్.టెబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 15 వేలకు పైగా వ్యూస్ రాగా.. వెయ్యికి పైగా లైకులు వచ్చాయి. ‘పాపం! సింగిల్స్ బాధలు ఇలానే ఉంటాయి’ అంటూ నెటిజన్లు రాసుకొచ్చారు.